ఏలూరు:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి
ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. పేదలకు కార్పోరేట్ వైద్యం అందాలని దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి
ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని కాంగ్రెసు ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయానీయంగా
తయారయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
గత సంవత్సరం డిసెంబరులో కిరణ్ కుమార్ రెడ్డి
ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు తనపై వేటు పడుతుందని
తెలిసి కూడా రైతులు, పేదల
కోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారని అన్నారు.
పదవులు మధ్యలో వదులుకోవాలంటే చాలామంది ఆలోచిస్తారని, అలాంటిది ఆయన రైతుల బాగు
కోసం పదవిని త్యాగం చేశారన్నారు.
దివంగత
ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి,
ఆయన కుటుంబ సభ్యులపై యెల్లో మీడియా సిగ్గూ, ఎగ్గూ లేకుండా బురద
జల్లుతోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి వేరుగా హైదరాబాదులో ఆరోపించారు. మీడియాపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చాలా గౌరవముందన్నారు.
జగన్
పైన కొన్ని జాతీయ పత్రికల్లో కూడా
అసత్య కథనాలు రాస్తున్నారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
తొత్తులు ఆ పత్రికలను కలుషితం
చేస్తున్నారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ఏం తప్పు చేశారని
అరెస్టవుతారని ఆయన ప్రశ్నించారు. ఆయన
చేసిన తప్పేమిటో చెప్పాలని కాంగ్రెసు, టిడిపిలను ప్రశ్నించారు.
0 comments:
Post a Comment