హాట్
హీరోయిన్ అనుష్క విద్యాబాల్ నటించిన ‘డర్టీ పిక్చర్’ చిత్రం రీమేక్ లో నటిస్తున్నట్లు వార్తలు
వచ్చిన సంగతి తెలిసిందే. విద్యా
బాలన్ నటించిన ‘డర్టీ పిక్చర్’ చిత్రం ఉత్తరాదిన భారీ విజయం సాధించింది.
అయితే విద్యా బాలన్ దక్షిణాది ప్రేక్షకులకు
పెద్దగా టచ్ లేక పోవడంతో
ఈ సినిమా ఇక్కడి ప్రేక్షకులకు రీచ్ కాలేదు.
దీంతో
ఆ చిత్ర నిర్మాతలు దక్షిణాది
భాషల్లో ‘డర్టీ పిక్చర్’ రీమేక్ చేయడానకి సన్నాహాలు చేస్తున్నారు. వారు అనుష్క, నిఖిత
పేర్లను పరిశీలిస్తున్నారని, అనుష్క దాదాపుగా ఖరారైందని వార్తలు వచ్చాయి. ఈయితే ఈ వార్తలను
అనుష్క మేనేజర్ ఖండించారు. ‘డర్టీ పిక్చర్’ రీమేక్‌లో అనుష్క నటించడం
లేదని, ఆ వార్తల్లో వాస్తవం
లేదని స్పష్టం చేశాడు.
అనుష్క
ప్రస్తుతం ఆర్య హీరోగా సెల్వరాఘవన్
దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఇరండం ఉళగం’ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి తెలుగులో
‘బృందావనంలో నందకుమారుడు’
అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు
సమాచారం. ఇందులో అనుష్క డబల్ రోల్ చేస్తోంది.
ఈ చిత్రంలో ఓ పాత్ర కోసం
అనుష్క రీసెంట్ గా మార్షిల్ ఆర్ట్స్
సైతం నేర్చుకున్న సంగతి తెలిసిందే.
వీటితో
పాటు కార్తీ హీరోగా నటిస్తున్న అలెక్స్ పాండ్యన్, విక్రమ్ హీరోగా రూపొందుతున్న తాండవం అనే తమిళ చిత్రాల్లో
కూడా అనుష్క నటిస్తోంది. ఆమె తెలుగులో నాగార్జునతో
నటించిన ‘డమరుకం’ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. మరోవైపు ప్రభాస్‌కు జోడీగా ‘వారధి’ చిత్రంలో
హీరోయిన్గా నటిస్తోంది.
0 comments:
Post a Comment