హైటెక్
వ్యభిచారం సూత్రధారిగా అరెస్టయిన వర్ధమాన నటి తారా చౌదరి
హైదరాబాదు నుంచి బెంగుళూర్ పారిపోవడానికి
ప్రయత్నిస్తున్న సమయంలో అరెస్టయింది. విశాఖపట్నానికి చెందిన ఓ యువతి తప్పించుకుని
వచ్చి మీడియాకు ఎక్కడంతో తారా చౌదరిని పోలీసులు
అరెస్టు చేశారు. తారా చౌదరి అసలు
పేరు రాజేశ్వరి అని తెలుస్తోంది. కొన్నేళ్ల
క్రితం ఆమె సినీ రంగంలో
ప్రవేశించింది. అయితే, తారా చౌదరి జాబితాలో
చాలా మంది ప్రముఖులు ఉన్నట్లు
వార్తలు వస్తున్నాయి. ఉద్యోగాలు ఎర చూపి తారా
చౌదరి అమాయకమైన అమ్మాయిలను రొంపిలోకి దింపుతోందనే ఆరోపణలు వచ్చాయి.
తారా
చౌదరి డైరీలో ఇద్దరు పార్లమెంటు సభ్యులు, ఇద్దరు సినీ ప్రముఖులు, నలుగురు
డిఎస్పీలు, పది మంది ఇన్స్పెక్టర్ల నెంబర్లు ఉన్నట్లు తెలుస్తోందంటూ వార్తలు వచ్చాయి. దీంతో ఆ విషయాలపై
పోలీసులు ఆ వ్యవహారాలపై ఆరా
తీస్తున్నారు. తారా చౌదరి పదేళ్ల
క్రితం ప్రకాశం జిల్లా నుంచి హైదరాబాద్ వచ్చింది.
హైదరాబాదు వచ్చిన తర్వాత చిన్నాచితక వేషాలు వేస్తూ వచ్చింది.
తన మాటలతో పలువురు ప్రముఖులను ఆమె ఆకట్టుకుంటూ పని
కానిచ్చుకుని వెళ్తున్నట్లు తెలుస్తోంది. వారి కోసం ఆమె
ప్రముఖ హోటళ్లలో విందులు, వినోదాలు కూడా ఏర్పాటు చేసేదట.
ఆమె తన నివాసంలో హైటెక్
స్పై కెమెరాలను, మైకులను ఏర్పాటు చేసి ప్రముఖులు అమ్మాయిలతో
గడిపిన సన్నివేశాలను రికార్డు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వాటితో ఆ తర్వాత బ్లాక్
మెయిల్కు పాల్పడుతూ వచ్చిందని
చెబుతారు. తారా చౌదరి ల్యాప్టాప్ను పోలీసులు
స్వాధీనం చేసుకున్నారు. అయితే పాస్వర్డ్
తెలియకపోవడంతో దాన్ని తెరవలేకపోయారు. ఇదే విషయాన్ని పోలీసులు
కోర్టుకు తెలిపారు.
తారా
చౌదరిని, ఆమె సహాయకుడు ప్రసాద్ను విచారిస్తే ఆమెకు
సహకరిస్తున్న ప్రముఖుల పేర్లు కూడా బయటకు వస్తాయని
అంటున్నారు. ఆమె సెల్ఫోన్
రికార్డులను పరిశీలించడానికి అనుమతి ఇవ్వాలని పోలీసులు నాంపల్లి కోర్టును కోరారు. తారా చౌదరి నివాసంలో
హోంగార్డు దరఖాస్తులు కూడా పోలీసులకు చిక్కినట్లు
తెలుస్తోంది.
తారా
చౌదరితో పాటు అరెస్టయిన ప్రసాద్
ఆమె భర్తేనని చెబుతున్నారు. రాగినేని దుర్గా ప్రసాద్ అనే అతను ఆర్
దుర్గాప్రసాద్, పిఎల్ ప్రసాద్, పి.
రాము అనే పేర్లతో వ్యవహరించేవాడని
అనుమానిస్తున్నారు. ఐదు సెల్ఫోన్లను,
పాన్ కార్డులను, కోండోమ్ ప్యాకెట్లను కూడా తారా చౌదరి
ఇంట్లో పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
0 comments:
Post a Comment