తిరుపతి:
హీరో నందమూరి బాలకృష్ణ అంటే తనకు ఎంతో
అభిమానమని, పార్టీలకు అతీతంగా ఆయనకు తాను మద్దతిస్తానని
ఉత్తరప్రదేశ్ రాంపూర్ పార్లమెంటు సభ్యురాలు జయప్రద మంగళవారం అన్నారు. ఆమె శ్రీవారిని దర్శించుకున్నారు.
అనంతరం ఓ ఛానల్ కార్యక్రమంలో
మాట్లాడారు. బాలకృష్ణ తనను ఎప్పుడు పిలిచినా
సపోర్ట్ చేస్తానని చెప్పారు. ఆ కుటుంబంతో మంచి
అనుబంధం ఉందన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావుపై అభిమానంతో
తాను టిడిపిలో చేరానని చెప్పారు. ఎన్టీఆర్ కారణంగా తాను బాబుకు మద్దతు
పలికానన్నారు. బాబు మంచి వాడు
కాదని తాను చెప్పలేదన్నారు. తొమ్మిదేళ్లు
రాష్ట్రాన్ని బాగా పాలించారన్నారు. బాబు
మంచి నాయకుడు అన్నారు.
తనకు
ఎపి పుట్టినిల్లు అని యుపి మెట్టినిల్లు
అన్నారు. ఎపి రాజకీయాలంటో ఇష్టం
అన్నారు. తెలుగు వారి అభిమానం వల్లే
తాను ఎంపిని అయ్యానని చెప్పారు. వారి అండతోనే తాను
రాజకీయంగా ఎదిగానన్నారు. పుట్టినిల్లు అంటేనే ఎవరికైనా అభిమానం ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం ఎపి రాజకీయాలు తెలంగాణ
తదితర సమస్యలతో క్లిష్టంగా ఉందన్నారు. కఠిన సమస్యలను దాటాల్సి
ఉందన్నారు. తాను ప్రస్తుతం యుపి
రాజకీయాల్లో ఉన్నానని, ఇక్కడకు వచ్చినప్పుడు ఏ పార్టీలో చేరాలనే
అంశంపై పెద్దలతో చర్చిస్తానని అన్నారు. ప్రస్తుతానికైతే అలాంటి ఆలోచన లేదన్నారు.
తాను
ఎక్కడున్నప్పటికీ తెలుగు బిడ్డనే అన్నారు. ఏ స్థాయిలో ఉన్నప్పటికి
తెలుగు వారిని మరిచిపోనన్నారు. బిఎస్పీ అధ్యక్షురాలు మాయావతిపై ఉన్న వ్యతిరేకత యుపిలో
ఎస్పీని గెలిపించిందన్నారు. అజంఖాన్ తనను రాజకీయంగా ఎదుర్కొనక
మహిళ అని చూడకుండా అశ్లీలంగా
చిత్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు.
తన మద్దతుదారులు ఓడినందుకు కుంగి పోవడం లేదన్నారు.
రాజకీయాల్లో ఇవన్నీ సాధారణమే అన్నారు. గెలిచినప్పుడు ఆనందించానని, ఓడినప్పుడు మాత్రం నిరాశపడనని చెప్పారు. అది ఏ నాయకుడికి
కూడా సరికాదన్నారు.
చంద్రబాబు
అధికారంలో ఉన్నప్పుడు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు
చేశారని, అమర్ సింగ్ అందులో
కీలక పాత్ర పోషించారన్నాురు. అలాంటి
కూటమి మళ్లీ వస్తుందా చూడాలన్నారు.
నేను యుపిలో ఉన్నప్పటికీ ఎపి ప్రజలు నన్ను
ఎప్పుడు ఆదరించారన్నారు. అక్కడ నా గెలుపు
కోసం తెలుగు ప్రజలు చూశారన్నారు. తాను ఎపికి రావడానికి
మధ్యంతర ఎన్నికలు కోరుకోనని చెప్పారు. ప్రస్తుతం తాను ఏ పార్టీలోకి
వెళ్లాలనే అంశాన్ని ఆలోచించడం లేదన్నారు. తన నియోజకవర్గానికి ఎంతో
చేయాల్సింది ఉందన్నారు. తాను ఆంధ్రకు వస్తే
ఇక్కడ ప్రతి ఆడబిడ్డకు న్యాయం
చేస్తానన్నారు.
0 comments:
Post a Comment