హైదరాబాద్:
తన పార్టీ తులసి మొక్కలా ఎదగాలన్న
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ
నాయుడు కౌంటర్ వేశారు. జగన్ తులసి మొక్క
కాదని కలుపు మొక్క అని
మండిపడ్డారు. గాలి, మాజీ మంత్రులు
యనమల రామకృష్ణుడు, రావుల చంద్రశేఖర రెడ్డి
మంగళవారం మీడియాతో మాట్లాడారు.
దివంగత
ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి
జివోల మీద జివోలు జారీ
చేసి భారీగా అక్రమాలకు పాల్పడ్డారని గాలి ఆరోపించారు. కాంగ్రెసు
పార్టీ నేతలు రాష్ట్రాన్ని చీడపురుగుల్లా
దోచుకున్నారని అన్నారు. ఐఏఎస్ అధికారులు ఇప్పటికైనా
నిర్భయంగా నిజాలు చెప్పాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రం అంధకారంలో మునిగి పోవడానికి కారణం వైయస్సే అన్నారు.
కరెంట్
ఛార్జీల పెంపుపై వైయస్ జగన్ ధర్నా
చేయడం విడ్డూరంగా ఉందన్నారు. తండ్రి చేసిన తప్పులకు కొడుకు
ధర్నా చేస్తున్నారని అన్నారు. వైయస్సార్ సంతకాల యంత్రమైతే జగన్ వసూళ్ల యంత్రం
అని విమర్శించారు. కాంగ్రెసు ప్రభుత్వం ప్రజల జేబుల్లో చేతులు
పెట్టి మరీ దోచుకుంటుందని రావుల
విమర్శించారు.
ఇప్పటికే
ప్రభుత్వం దాదాపు తొమ్మిది వందల మండలాలను కరువు
మండలాలుగా ప్రకటించిందన్నారు. కరువు ఉందని చెప్పిన
ప్రభుత్వమే ఛార్జీలు పెంచి ప్రజలపై భారాన్ని
మోపుతోందన్నారు. కరెంట్ ఛార్జీల పెంపును నిరసిస్తూ బుధవారం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల కేంద్రాలలో
నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు.
0 comments:
Post a Comment