ఏలూరు:
అధికార పార్టీతో ఢీకొనడం కష్టమని తెలిసీ ప్రసాద రాజు ధైర్యం చేసి
తెలుగుదేశం పార్టీ కిరణ్ కుమార్ రెడ్డి
ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టినప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారని వైయస్సార్
కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం అన్నారు. ఆయన పశ్చిమ గోదావరి
జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన
మాట్లాడారు. నీతిమాలిన రాజకీయ వ్యవస్థలో విలువలను బతికించడానికి ప్రసాద రాజు అవిశ్వాసానికి మద్దతిచ్చారని
అన్నారు.
ఉప ఎన్నికల్లో అధికార పార్టీ డబ్బుల మూటలు కుమ్మరిస్తోందని ఆరోపించారు.
పోలీసులు కూడా అధికార పార్టీకి
అండగా ఉంటున్నారని విమర్శించారు. ప్రసాద రాజు పేదల పక్షాన
నిలబడటం రాజకీయాల్లోని కుళ్లును కడిగేయడానికేనన్నారు. తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని వైయస్సార్ కాంగ్రెసును దెబ్బతీయాలని చూస్తున్నాయన్నారు. రాష్ట్రంలో అందరూ వైయస్సార్ కాంగ్రెసు
వైపు చూస్తున్నారని అన్నారు.
పశ్చిమ
గోదావరి జిల్లా సీతారామపురంలో జగన్ దివంగత ముఖ్యమంత్రి
వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు నర్సాపూరం లూథరన్ చర్చిలో జగన్ ప్రత్యేక పూజలు
చేశారు. జిల్లాకు చెందిన సీనియర్ నేత చేగొండి హరిరామజోగయ్య
ఇప్పటికే పార్టీలో చేరిన విషయం తెలిసిందే.
చిరంజీవి
ప్రజారాజ్యం పార్టీ స్థాపించాక ఆ పార్టీ తరఫున
జిల్లాలో కీలక పాత్ర పోషించిన
తోట గోపి కూడా జగన్
సమక్షంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా గోపి
మాట్లాడారు. రాష్ట్రంలో జగన్ ప్రభంజనం ఉందన్నారు.
ఈ నెల 4న పార్టీలో
చేరనున్నట్లు చెప్పారు. హరిరామజోగయ్యకు శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చానని ఆయన తెలిపారు.
0 comments:
Post a Comment