హైదరాబాద్:
ఉద్యోగాలిప్పిస్తామని, సినీ అవకాశాలు ఇప్పిస్తామని
చెప్పి కొందరు యువతులను నమ్మించి నగరానికి రప్పించి బలవంతంగా వ్యభిచార రొంపిలోకి దింపుతున్న తారా చౌదరి లీలలు
ఒక్కటొక్కటి వెలుగు చూస్తున్నాయి. సోమవారం పోలీసులు బంజారాహిల్స్ లోని ఆమె ఇంట్లో
ఆకస్మిక తనిఖీలు జరిపారు. ఇందులో ఎన్నో విషయాలు తెలుసుకున్నట్లుగా
తెలుస్తోంది. పలువురు ప్రముఖులతో ఆమె దిగిన ఫోటోలు
పోలీసులు కనుగొన్నట్లుగా తెలుస్తోంది. ఆమె ఇంట్లో నుండి
ఏడు సెల్ ఫోన్లు, భారీగా
నగదు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
తారా
చౌదరి యువతులకు తెలియకుండా స్పై ఆపరేషన్ నిర్వహించేదని
పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె ఇంట్లో ఓ
రహస్య కెమెరాను పోలీసులు కనుగొన్నట్లుగా తెలుస్తోంది. రహస్య కెమెరాల ద్వారా
తన వద్దకు వచ్చిన యువతులను నగ్నంగా ఫోటోలు తీసి వారిని బెదిరించి,
బ్లాక్ మెయిల్ చేసి వ్యభిచార కూపంలోకి
దింపి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బెదిరింపులకు
లొంగని యువతుల చిత్రాలను ఇంటర్ నెట్లో
పెడతానని తారా చౌదరి బెదిరించేదని
తెలుస్తోంది. బెదిరింపుల ద్వారా కొందరిని వ్యభిచార కూపంలోకి లాగిన తారా, మరికొందరి
నుండి లక్షల రూపాయల డబ్బులు
కూడా వసూలు చేసి ఉంటుందని
అనుమానిస్తున్నారు. బెదిరింపులకు లొంగని పలువురి ఫోటోలు ఇంటర్ నెట్లో పెట్టి
ఉంటుందని అనుమానిస్తున్నారు. ఈమె బాధితుల్లో ప్రముఖులు
కూడా ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు.
కాగా
యువతులను మోసం చేస్తున్న తారా
చౌదరిని రెండు రోజుల క్రితం
పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
ఆమెను, ఆమె సన్నిహితుడిని పోలీసులు
ఆదివారం రిమాండుకు పంపించారు. విజయవాడకు చెందిన తార చౌదరి తన
సన్నిహితుడితో కలిసి బంజారాహిల్స్ ఠాణా
పరిధిలోని శ్రీనగర్ కాలనీ ప్రాంతంలో విశాలమైన
ఓ ఇంటిని అద్దెకు తీసుకొని కొన్నేళ్లుగా ఉంటోంది. ఇటీవల ఓ యువతిని
నమ్మించి నగరానికి రప్పించి బలవంతంగా వ్యభిచారం నిర్వహించడంతో వారి నుంచి తప్పించుకున్న
యువతి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
0 comments:
Post a Comment