‘‘అది
ఎవరో గిట్టని వాళ్లు పుట్టించిన రూమర్ మాత్రమే. పూర్తిగా
నాన్సెన్స్...వింటూంటే నాకే ఆశ్చర్యంగా ఉంది.
అయినా కార్తీకతో నాకు గొడవలేంటి..ఆ
అమ్మాయి చాలా మంచిది..గొడవ
పడదామన్నా పడలేం. అంత బుద్ధిమంతురాలు. తనతో
స్క్రీన్ని షేర్ చేసుకోవడం
చాలా ఆనందంగా ఉంది. ‘దమ్ము’ మా ఇద్దరి కెరీర్లో ది బెస్ట్
మూవీగా నిలుస్తుంది’’
అంటూ ఖండించింది త్రిష.
‘దమ్ము’ చిత్రంలో
తనతోపాటు మరో హీరోయిన్ గా
నటిస్తున్న కార్తీకతో తనకు విభేదాలంటూ మీడియాలో
వస్తున్న వార్తలపై త్రిష స్పందిస్తూ ఇలా
మాట్లాడింది. అలాగే తనకి గ్లామర్
హీరోయిన్గా ఇంకా అయిదేళ్ల
పాటు కొనసాగగలిగే సత్తా ఉందని చెప్పింది.
ఇంకా నాలోని గ్లామర్ చెరిగిపోలేదు. వయసు గురించి నేనెప్పుడూ
ఆలోచించను అంది. ఇప్పుడు వయసు
ముప్ఫై దాటినా అందంగా కన్పిస్తే చాలు హీరోయిన్లకు అవకాశాలొచ్చేస్తున్నాయి..కాబట్టి నా కెరీర్ కి
ఢోకా లేదు అంది.
ఇక దమ్ము చిత్రంలో త్రిష,
కార్తీక పాత్రలు గురించి బోయపాటి శ్రీనుని మీడియాకు చెపుతూ... ''కథ ప్రకారం ఇద్దరూ
ఉండాల్సిందే. త్రిష, కార్తీక రెండు పాత్రలు కూడా
పోటా పోటీగానే ఉంటాయి. సినిమా చూస్తే ఆ విషయం మీకే
అర్థమవుతుంది'' అన్నారు. అలాగే ఎన్టీఆర్ కే
దమ్ము ఉంది. అంతటి మగాడు
అతనే. మీసమున్న ప్రతి ఒక్కడూ మగాడు
కాదు. దమ్మున్నోడే సిసలైన మొనగాడు. అంటే ఒక్క చేత్తో
వంద మందిని కొట్టడం కాదు. ఒక్కరి కోసం
వంద దెబ్బలకు ఎదురు నిలవడం. ఆ
కుర్రాడూ అంతే! నమ్ముకొన్న వారి
కోసం తన దమ్ము చూపించాడు.
అదెలాగో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే
అన్నారు.
బోయపాటి
శ్రీను, త్రిష, కార్తీక హీరోయిన్స్ గా చేస్తున్న ఈ
చిత్రానికి అలెగ్జాండర్ వల్లభ నిర్మాత. ఈ
చిత్రం విజయంపై దర్శకుడు చాలా కాన్పిడెంట్ గా
ఉన్నారు. ఆయన మాట్లాడుతూ..''ఎన్టీఆర్
దమ్ముని కొత్త కోణంలో ఆవిష్కరిస్తున్నాం.
మాస్ యాక్షన్ అంశాలతో పాటు వినోదం మేళవించాం.
పోరాటాలు ఆకట్టుకొంటాయని అన్నారు. ఇక రీసెంట్ గా
దమ్ము ఆడియో విడుదలై మంచి
టాక్ తెచ్చుకుంది.
0 comments:
Post a Comment