హైదరాబాద్:
మైనారిటీలకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని, లేనిపక్షంలో
2014 ఎన్నికలలో ఎంఐఎం సహకారం తమకు
అవసరమో కాదో ముఖ్యమంత్రి కిరణ్
కుమార్ రెడ్డి తేల్చుకోవాలని ఎంఐఎం అధినేత, పార్లమెంటు
సభ్యులు అసదుద్దీన్ ఒవైసీ సోమవారం హెచ్చరించారు. మెదక్ జిల్లా సంగారెడ్డిలో
ఇరువర్గాల ఘర్షణలో ధ్వంసమైన ఆస్తులను అసదుద్దీన్ సోమవారం పరిశీలించి, బాధితులను పరామర్శించారు.
అనంతరం
విలేకరులతో మాట్లాడారు. మైనార్టీలను లక్ష్యం చేసుకొని ఈ దాడులు జరగడం
గుజరాత్ ఘటనలను గుర్తుకు తెస్తోందన్నారు. తెలంగాణ సమస్య, అంతర్గత కలహాలతో సతమతమవుతున్న కాంగ్రెస్ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణపై దృష్టి సారించడం లేదని ఆరోపించారు. అందుకే
ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని విమర్శించారు.
మైనారిటీలకూ ఓట్లు ఉన్నాయన్న విషయాన్ని
గుర్తించాలని ఆయన కాంగ్రెస్ను
హెచ్చరించారు.
సంగారెడ్డి
అల్లర్ల వెనుక కాంగ్రెస్ ఎమ్మెల్యే,
విప్ తూర్పు జయప్రకాశ్ రెడ్డి హస్తం ఉందని ఆరోపించారు.
ఆయన అనుచరుడైన పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు
షేక్ సాబేర్ ముందుండి మరీ ఈ గొడవలు
చేయించారని అసదుద్దీన్ ఆరోపించారు. జిల్లాలోని పది నియోజకవర్గాల్లో ఎనిమిదింట
కాంగ్రెస్వాదులను గెలిపించింది ఇలాంటి అల్లర్లను సృష్టించడానికా అని ఆయన ప్రశ్నించారు.
ఈ ఘటనపై చీఫ్ సెక్రటరీ,
సీనియర్ ఐఏఎస్, హైకోర్టు సిట్టింగ్ జడ్జిలలో ఒకరితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సాబేర్ను వెంటనే అరెస్టు
చేయాలని డిమాండ్ చేశారు. ఈ గొడవలకు పోలీసుల
నిర్లక్ష్యం కూడా ప్రధాన కారణమేనని
చెప్పారు. అందువల్ల స్థానిక డిఎస్పీ, సిఐలను సస్పెండ్ చేసి, అరెస్టు చేయాలని
డిమాండ్ చేశారు.
0 comments:
Post a Comment