చిత్తూరు:
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి,
రాజ్యసభ సభ్యుడు చిరంజీవి తిరుపతి పర్యటన సోమవారం చప్పగా ముగిసింది. సోమవారం సాయంత్రం శ్రీ వెంకటేశ్వర వైద్య
కళాశాల ఆవరణలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి తన
ప్రసంగాన్ని రెండంటే రెండే నిమిషాల్లో ముగించారు.
సభకు మహిళలు పెద్ద సంఖ్యలోనే హాజరైనా
ముఖ్యమంత్రి ప్రసంగించే సమయానికే చాలామంది వెళ్లి పోవడం విశేషం.
సభ మొదలైనప్పటి నుంచే ఒక్కొక్కరుగా వెళ్లి
పోవడం ప్రారంభించారు. ఆ తర్వాత చిరంజీవి
మాట్లాడిన అనంతరం మిగిలిన వారిలోనూ చాలా మంది వెళ్లిపోయారు.
దీంతో కిరణ్ తన ప్రసంగాన్ని
రెండు నిమిషాలకే పరిమితం చేశారు. చిరంజీవి కొద్దిసేపు మాట్లాడినా అందులో ముఖ్యమంత్రిని పొగడటానికే ఎక్కువ సమయం కేటాయించారు. అంతకుముందు
పలువురు మహిళలు ముఖ్యమంత్రి కాన్వాయ్ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
మరోవైపు
నగరిలోని దివ్యధామ కుంభాభిషేకంలో పాల్గొనేందుకు వచ్చిన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మాజీ చైర్మన్ డికె
ఆదికేశవులు పలకరించినా చిరంజీవి స్పందించలేదట. చిరంజీవి రాజీనామాతో జిల్లాలో ఆయన సామాజిక వర్గానికి
చెందిన పలువురు తమ దారి తాము
చూసుకుంటున్నారు. ఈ సమయంలో అదే
సామాజిక వర్గానికి పెద్దదిక్కుగా ఉన్న డికెతో చిరంజీవి
తీరు చర్చనీయాంశమైంది.
కాగా
సోమవారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చిరంజీవితో కలిపి పర్యటించిన విషయం
తెలిసిందే. అక్కడ రూ.80 కోట్లతో
అభివృద్ధి పనులు ప్రారంభించారు. అంతకుముందు
తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో
ధీటైన అభ్యర్థి కోసం కిరణ్, చిరంజీవిలు
కలిసి అభిప్రాయ సేకరణ జరిపారు. నగర
నాయకులు, ఎంపి చింతా మోహన్తో చర్చించి అందరి
అభిప్రాయాలూ తీసుకున్నారు.
0 comments:
Post a Comment