జూనియర్
ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న 'దమ్ము' ఈ నెల 27న
విడుదల కానుంది. త్రిష, కార్తీక నాయికలు. బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. సీసీ మీడియా అండ్
ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్
పతాకంపై కె.ఎ.వల్లభ
నిర్మిస్తున్నారు. చిత్ర సమర్పకుడు కె.ఎస్.రామారావు మాట్లాడుతూ
"రీరికార్డింగ్ పూర్తి కావచ్చింది. మరో 10 రోజుల్లో సెన్సార్కు వెళ్తాం. ప్రేక్షకులు
ఆశించేదాన్ని మించి బోయపాటి శ్రీను
చిత్రాన్ని తీర్చిదిద్దారు. 100 శాతం నిబద్ధతతో తెరకెక్కించారు.
లెజండరీ చిత్రమవుతుంది" అని అన్నారు.
"కీరవాణి
సంగీతం, రత్నం డైలాగులు, ఆర్థర్
విల్సన్ పనితనం తెరమీద కనిపిస్తుంది. మా సంస్థలో తప్పకుండా
పెద్ద హిట్ చిత్రంగా నిలుస్తుంది.
ఎన్టీఆర్ని మాస్ హీరోగా
ఎక్స్పెక్ట్ చేసేవారికి ఆయన మాస్తో
పాటు ఫ్యామిలీ హీరోగా కనిపిస్తారు. ప్రతి కుటుంబంలో ఇలాంటి
కొడుకు, ఇలాంటి హీరో ఉండాలని అందరూ
కోరుకునేలా ఉంటుంది ఆయన పాత్ర. ఆయన
నటన గురించి ఎంత చెప్పినా చెప్పాలనిపిస్తుంది.
కొన్ని సన్నివేశాలు కన్నీళ్ళు తెప్పిస్తాయి. రామ్-లక్ష్మణ్ ఫైట్లు
కొత్తగా ఉంటాయి'' అని ఆయన అన్నారు.
బోయపాటి
మాట్లాడుతూ - "అందరూ బావుండాలి. అందరిలో
నేనుండాలి అనుకునే పాత్రలో హీరో కనిపిస్తారు. ఆది
నుంచి నా సిద్ధాంతం ఒకటే.
ప్రేక్షకులు, పంపిణీదారుడు, నిర్మాత సినిమా చూసి ఆనందంగా ఉండాలి.
మా నిర్మాతలు నేను అడిగినవన్నీ ఇచ్చారు.
'దమ్ము'ను ఈ నెల
27న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. తారక్ని అందరూ
ఇప్పటిదాకా ఒకవైపే చూశారు. అతని నడక, స్టైల్,
రాయల్ను ఈ చిత్రంలో
రెండో వైపు చూస్తారు'' అని
చెప్పారు.
ఈ చిత్రానికి కెమెరా: ఆర్థర్ విల్సన్, సంగీతం: ఎం.ఎం.కీరవాణి,
రచన: ఎం.రత్నం, పాటలు:
చంద్రబోస్, కళ: ఆనంద్ సాయి,
ఫైట్స్: రామ్-లక్ష్మణ్, కూర్పు:
కోటగిరి వెంకటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎ.సునీల్ కుమార్,
నిర్మాత: కె.ఎ.వల్లభ,
సమర్పణ: కె.ఎస్.రామారావు.
0 comments:
Post a Comment