రాజమౌళి
తాజా చిత్రం ‘ఈగ’ ప్రతీ విషయంలోనూ తనదైన
ప్రత్యేకతతో ముందుకు వస్తోంది. పెద్ద హీరోల బడ్జెట్
తో రూపొందిన ఈ చిత్రం మరో
విషయంలోనూ స్టార్ హీరోలకు పోటీ ఇస్తోంది. అదే
నాలుగు రాష్ట్రాల్లో భారీగా ఈ చిత్రం ఒకే
రోజు విడుదల అవుతోంది. నాని, సమంత, సుదీప్
కాంబినేషన్లో రూపొందిన ఈ
చిత్రం ‘టాక్ ఆఫ్ ది
ఇండస్ట్రీ’ అయ్యింది.
ఇప్పుడు పెద్ద హీరోలతో సమానంగా
ఈ చిత్రం పై అంతటా క్రేజ్
ఏర్పడింది. ముఖ్యంగా ఈ సమ్మర్ లో
పిల్లలను,పెద్దలను ఒకేసారి ఆకర్షించే చిత్రంగా ఈగను ట్రేడ్ లో
భావిస్తున్నారు. దాంతో ఈ చిత్రం
విజయం స్టామినాపై, క్రియేట్ చేయబోయే రికార్డులపై అంచనాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి.
తెలుగు,
తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని రూపొందించారు.
తమిళంలో ‘నాన్ ఈ’ పేరిట విడుదల కానుంది.
మలయాళంలో ఈ చిత్రాన్ని అనువదించి,
విడుదల చేస్తున్నారు. ‘ఈచ’ పేరిట కేరళ తెరపై
కనిపించబోతోంది మన ఈగ. కర్నాటకలో
అనువాద చిత్రాలను అనుమతించరు కాబట్టి, తెలుగు చిత్రాన్నే అక్కడ విడుదల చేయబోతున్నారు.
మొత్తం నాలుగు రాష్ట్రాల్లోనూ మే 30న ‘ఈగ’ విడుదల
కాబోతోంది. తన ప్రియురాలికి దక్కనివ్వకుండా
తనను చంపిన వ్యక్తిపై పగ
తీర్చుకునే వ్యక్తి కథ ఇది. చనిపోయిన
తర్వాత ‘ఈగ’ రూపంలో విలన్ని వేటాడి,
వేధిస్తాడు ప్రియుడు. వినడానికే విచిత్రంగా ఉన్న ఈ కథను
తనదైన శైలిలో రాజమౌళి తెరకెక్కించి ఉంటారని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
రాజమౌళి
తాజా చిత్రం ' ఈగ'త్వరలో విడుదలకు
రెడీ అవుతోంది. ఈ సందర్భంగా ఈ
చిత్రం ప్రమోషన్ ని పెంచారు రాజమౌళి.
ఫేస్ బుక్,ట్విట్టర్,మీడియా,టీవీ ఛానెల్స్ అనే
తేడా లేకుండా ఈ చిత్రాన్ని భారీ
లెవల్లో పబ్లిసిటీ చేస్తున్నారు. ఆయన తాజాగా ఈ
చిత్రం కధ గురించి చెబుతూ
తమ చిత్రం నాని, బిందుల మధ్య
లవ్ స్టోరీ అన్నారు. నాని పాత్రలో నాని,బిందు పాత్రలో సమంత
నటిస్తోంది అన్నారు. మధ్యలో సుదీప్ పాత్ర ప్రవేసించి ఏమి
చేసిందనేదే కథ అంటున్నారు.
ఆయన మాటల్లోనే...ఆ అబ్బాయి పేరు
నాని. పెళ్లీడు వచ్చేసిన కుర్రాడు. ఓ రోజు బిందు
అనే అందాల భామని చూసి
మనసు కూడా పారేసుకొన్నాడు. రోజులు,
నెలలు, సంవత్సరాలు గడుస్తున్నా మూగగా ఆరాధిస్తాడే తప్ప
ప్రేమ విషయం చెప్పడు. ఇదంతా
బిందుకీ సరదాగానే ఉంది. ఓ రోజు
ధైర్యం చేసి 'ఐ లవ్
యూ' చెప్పేద్దాం అనుకొన్నాడు. అప్పుడే కథలోకి మరో పాత్ర ప్రవేశించింది.
నాని, బిందుల మధ్య అడ్డుగోడలా నిలిచింది.
అతనెవరు? ఈ ప్రేమ కథ
ఏ మలుపు తిరిగింది? అనే
విషయాలు మా సినిమా చూసి
తెలుసుకోవల్సిందే అన్నారు ఎస్.ఎస్.రాజమౌళి.ఇక ఈ చిత్రానికి
సంగీతం కీరవాణి, స్టైలింగ్ ..రమా రాజమౌళి, ఛాయాగ్రహణం..సెంధిల్ కుమార్, సమర్ఫణ డి.సురేష్ బాబు
0 comments:
Post a Comment