విజయనగరం:
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు
విజయనగరం జిల్లాలో గట్టి ఎదురు దెబ్బ
తగిలింది. తెలుగుదేశం పార్టీలో కీలక బాధ్యతలు చేపట్టిన
జిల్లాకు చెందిన గద్దె రామ్మోహన రావు
టిడిపికి రాజీనామా చేశారు. బుధవారం చీపురుపల్లి నియోజకవర్గం కార్యకర్తల సమావేశంలో బాబురావు తన రాజీనామాను ప్రకటించారు.
ఆయన త్వరలో కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరనున్నారనే ప్రచారం జరుగుతోంది. గద్దె రామ్మోహన రావు
టిడిపిలో కీలక పదవులలో కొనసాగారు.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆయన ప్రభుత్వ విప్గా పని చేశారు.
అయితే గతంలోనూ ఆయన రెండుసార్లు పార్టీకి
రాజీనామా చేసి మళ్లీ కొనసాగారు.
2009 సాధారణ
ఎన్నికలలో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా
శాఖ మంత్రి బొత్స సత్యనారాయణపై చీపురుపల్లి
నియోజకవర్గం నుండి పోటీ చేసి
ఓడిపోయారు. కాగా ఇటీవల తెలుగుదేశం
పార్టీ చీఫ్ నారా చంద్రబాబు
నాయుడు విజయనగరం జిల్లాలో చేసిన భారీ ధర్నాకు
ఆయన దూరంగా ఉన్నారు.
గద్దె
రామ్మోహన రావు విజయనగరం జిల్లాలో
తెలుగుదేశం పార్టీకి ముఖ్యమైన నేత. ఆయన వైయస్సార్
కాంగ్రెసు పార్టీలో చేరితే జిల్లాలోని తెలుగుదేశం చాలా వరకు ఖాళీ
అవుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే పలువురు నేతలు
ఆయనను రాజీనామాను ఉపసంహరించుకోవాలని కోరినట్లుగా తెలుస్తోంది.
0 comments:
Post a Comment