ఈ రోజు పుట్టిన రోజు
జరుపుకుంటున్న దర్శుకుడు బోయపాటి శ్రీను తనకు తనే ఓ
బర్తడే గిప్ట్ ని ఇచ్చుకున్నారు. అది
మరేదో కాదు.. లగ్జరీ లాండ్ రోవర్ డిస్కవరి
4 కారుని ఆయన కొనుక్కున్నారు. ఈ
కారు ఇప్పటివరకూ రాజమౌళి,మహేష్ బాబు, ఎన్టీఆర్,
రామ్ చరణ్, నాగచైతన్య, మోహన్
బాబు వంటి తెలుగు స్టార్స్
కొద్దిమందికే ఉంది. దాంతో ఈ
కారుని ఎక్సక్లూజివ్ గా సొంతం చేసుకున్న
తెలుగు పరిశ్రమలోని వ్యక్తులలో ఒకడుగా బోయపాటి చేరారు. ఆయన తాజా చిత్రం
ఎల్లుండి అంటే 27 న విడుదల అవుతోంది.
ఈ సందర్భంగా ఆయన చాలా ఉత్సాహంగా
ఉన్నారు. తన తాజా చిత్రం
దమ్ముపై చాలా కాన్ఫిడెంట్ గా
ఉన్నారు. ఈరోజు అంటే బుధవారం
పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగానూ ఆయన ప్రత్యేకంగా మీడియాతో
మాట్లాడారు .
బోయపాటి
శ్రీను దమ్ము గురించి చెపుతూ...'సింహా' కంటే ఏ కోశానా
ఎమోషన్స్ని తగ్గించడానికి ప్రయత్నించలేదనీ,
ఇంకా ఓ పది శాతమన్నా
ఎక్కువ ఎమోషనల్గా 'దమ్ము' తీశాననీ
చెప్పారు అలాగే చాలా కాలం
తర్వాత బాలకృష్ణకు 'సింహా' రూపంలో హిట్టిచ్చిన దర్శకుడిగా నా మీద అంచనాలు
మామూలుగా లేవు. పైగా ఇప్పటివరకు
నేను అన్నీ హిట్లే ఇచ్చాను.
నేను 'సింహా'లో ఏం
చేశానో చూశారు. మొదట్నించీ నేను కొన్ని ఎమోషన్స్
పట్టుకుంటాను. వాటి మీద కథ
నడుపుకుంటూ వస్తాను. అలాగే 'దమ్ము'ని కూడా
కొన్ని ఎమోషన్స్ ప్రధానంగా నడిపా. ముఖ్యంగా ఫ్యామిలీ ఎమోషన్. 'సింహా' కంటే ఏ కోశానా
ఎమోషన్స్ని తగ్గించడానికి ప్రయత్నించలా.
అన్నారు.
ఇక ఎన్టీఆర్ అంటే మాస్ హీరో.
యాక్షన్ బాగా చేస్తాడు. డాన్సులు
బాగా చేస్తాడు. కమర్షియల్గా ఉంటుంది' అనుకోవద్దు.
తప్పకుండా ఓ కొత్త ఎన్టీఆర్ని చూస్తారు. 'సింహా'లో బాలయ్యని ఎలా
చూశారో, అలాగే 'దమ్ము'లో తారక్లోని ఓ కొత్త
కోణాన్ని చూస్తారు. ఎన్టీఆర్కి హైవోల్టేజ్ పర్ఫార్మర్
అనీ, రౌద్ర, వీర రసాల్ని బాగా
పోషిస్తారనే పేరుంది. అయితే 'సింహాద్రి' తర్వాత అంత హై వోల్టేజ్
సినిమా ఆయన నుంచి రాలేదనే
అభిప్రాయం ఉంది. 'సింహాద్రి' నుంచి ఎన్టీఆర్ ఏ
సినిమాలైతే చేశారో, ఆ సినిమాలన్నింటినీ విశ్లేషించుకునే
'దమ్ము' తీశా. ఏ కోశానా
పాత సినిమాలు ఛాయలు లేకుండా ఓ
భిన్నమైన పాత్రలోనే ఆయన్ని చూపిస్తున్నా. సినిమా చూశాక 'ఎన్టీఆర్లో ఇలాంటి హీరో
ఉన్నాడా' అని ఆశ్చర్యపోతారు అన్నారు.
బోయపాటి
శ్రీను. ఎన్టీఆర్ కథానాయకుడిగా రూపొందిన 'దమ్ము' చిత్రానికి ఆయన దర్శకుడు. కె.ఎస్. రామారావు సమర్పణలో
క్రియేటివ్ కమర్షియల్స్ అండ్ మీడియా ఎంటర్టైన్మెంట్స్ లిమిటెడ్
పతాకంపై కె.ఎ. వల్లభ
నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం
(27న) విడుదలవుతోంది. ఆ సందర్భంగానూ, పుట్టిన
రోజు సందర్భంగానూ ఆయనకు దట్స్ తెలుగు
శుభాకాంక్షలు తెలియచేస్తోంది.
0 comments:
Post a Comment