ఎన్టీఆర్
దమ్ము చిత్రమే ఇప్పుడు ఎక్కడ విన్నా హాట్
టాపిక్. ఈ చిత్రం గురించి
వచ్చే విశేషాలు అబిమానులను విశేషంగా అలరిస్తున్నాయి. తాజాగా ఈ చిత్రం గురించి
మరిన్ని విషయాలు తెలియవచ్చాయి. అవేమిటంటే...దమ్ము చిత్రం...రన్
టైమ్ రెండు గంటల 39 నిముషాలు.
ఈ చిత్రంలో ఫస్టాఫ్ గంట ...32 నిముషాలకు పూర్తి అయ్యి...ఇంటర్వెల్ వస్తుంది. సెకండాఫ్ 67 నిముషాలు ఉంటుంది. ఇక ఈ చిత్రం
ఇంటర్వెల్ బ్యాంగ్ హై ఓల్టేటి తో
కూడిన ఎమోషన్ తో ఉంటుంది. ఇంటర్వెల్
కు ముందు వచ్చే ఫైట్
సీక్వైన్స్, క్లైమాక్స్ సినిమాకు ప్రాణమై నిలుస్తాయి.
ఇక కామెడీ విషయానికి వస్తే...ఆహుతి ప్రసాద్, బ్రహ్మానందం,
అలీ మధ్యన వచ్చే కామెడీ
ట్రాక్ హిలేరియస్ గా ఉండనుంది. కార్తీక
ఈ సినిమాలో చాలా కొత్తగా కనపడుతుంది.
ఆమె ఈ సినిమాతో తెలుగులో
సెటిల్ అయిపోయేంతలా గ్లామర్ పండించిందని, ఫెరఫార్మెన్స్ పరంగాను అదరకొట్టిందని చెప్తున్నారు. ఏప్రియల్ 27న విడుదల అవుతున్న
ఈ చిత్రం ఆడియో ఇప్పటికే విడుదలై
మంచి పేరు తెచ్చుకుంది. ఇందులోని
పాటలు అంతటా మారుమ్రోగుతున్నాయి. కీరవాణి..రీ
రికార్డింగ్ కూడా సినిమాని ఓ
రేంజికి తీసుకు వెళ్లటంతో సాయిపడుతుందంటున్నారు. ఎన్టీఆర్ ఫెరఫార్మెన్స్, ఎమోషన్స్ పలికిన తీరు సింహాద్రిని గుర్తు
చేస్తుందంటున్నారు.
త్రిష,
కార్తీక హీరోయిన్స్ గా చేస్తున్న ఈ
చిత్రానికి అలెగ్జాండర్ వల్లభ నిర్మాత. ఇక
ఈ చిత్రం విజయంపై దర్శకుడు చాలా కాన్పిడెంట్ గా
ఉన్నారు. ఆయన మాట్లాడుతూ..''ఎన్టీఆర్
దమ్ముని కొత్త కోణంలో ఆవిష్కరిస్తున్నాం.
మాస్ యాక్షన్ అంశాలతో పాటు వినోదం మేళవించాం.
పోరాటాలు ఆకట్టుకొంటాయని అన్నారు. అలాగే ఎన్టీఆర్ కే
దమ్ము ఉంది. అంతటి మగాడు
అతనే. మీసమున్న ప్రతి ఒక్కడూ మగాడు
కాదు. దమ్మున్నోడే సిసలైన మొనగాడు. అంటే ఒక్క చేత్తో
వంద మందిని కొట్టడం కాదు. ఒక్కరి కోసం
వంద దెబ్బలకు ఎదురు నిలవడం. ఆ
కుర్రాడూ అంతే! నమ్ముకొన్న వారి
కోసం తన దమ్ము చూపించాడు.
అదెలాగో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే
అంటున్నారు బోయపాటి శ్రీను.
జూ ఎన్టీఆర్ ‘దమ్ము’ చిత్రం ఈ సారి టాలీవుడ్
రికార్డులన్నీ తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. అనధికారికంగా అందిన లెక్కల ప్రకారం
‘దమ్ము’
చిత్రం రిలీజ్కు ముందే రూ.
46 కోట్ల బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. సినిమాపై అంచనాలు భారీ ఎత్తున్న ఉన్న
నేపథ్యంలో విడుదలైన తర్వాత దమ్ము చిత్రానికి కాసుల
వర్షం కురుస్తుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా
కోస్తా రీజియన్లో డిస్టబ్యూటర్లంతా ‘ దమ్ము’ చిత్రానికి భారీగా సొమ్ములు చెల్లించి హక్కులు దక్కించుకున్నారు. హీరోగా యంగ్ టైగర్ కావడంతో
పాటు, బోయపాటి లాంటి సూపర్ హిట్
మాస్ చిత్రాల దర్శకుడిపై నమ్మకంతోనే ఇంత పెద్దమొత్తంలో సమర్పించుకున్నారని
అంటున్నారు.
0 comments:
Post a Comment