పవర్
స్టార్ పవన్ కళ్యాణ్-విక్టరీ
వెంకటేష్ కాంబినేషన్లో ఓ మల్టీ స్టారర్
సినిమా వస్తుందని ఆ మధ్య వార్తలు
వచ్చిన విషయం తెలిసిందే. అయితే
ఈ రోజు వరకు ఆ
చిత్రం విషయం ఇంకా ఓ
కొలిక్కి రాలేదు. ఎవరి సినిమాల్లో వారు
బిజీ అయి పోయారు. అయితే
తాజాగా వీరి సినిమా ఓ
కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.
ఇటీవల
విక్టరీ వెంకటేష్ స్వయంగా వెళ్లి పవన్ కళ్యాణ్ను
గబ్బర్ సింగ్ షూటింగులో కలిశారు.
వీరి సమావేశం వెనక సినిమా ప్రపోజల్
ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. వెంకటేష్, పవన్ కళ్యాణ్ చాలా
కాలంగా మంచి స్నేహితులు. ఇద్దరు
కలిసి నటిస్తే చూడాలని ఉందని ఇటు అభిమానులు
కూడా ఆశ పడుతున్నారు.
వాస్తవానికి
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలోనే వెంకీ-పవన్ కలిసి
నటించాల్సి ఉందని, కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ కాంబినేషన్
ఓకే కాలేదని అప్పట్లో వార్తలు వినిపించాయి.
ప్రస్తుతం
పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ షూటింగులో బిజీగా గుడుపుతున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో
బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈచిత్రం
మే రెండవ వారంలో విడుదలకు
సిద్దం అవుతోంది. వెంకటేష్ మెహర్ రమేష్ దర్శకత్వంలో
‘షాడో’
చిత్రంతో పాటు....శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్ బాబుతో కలిసి
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలో నటిస్తున్నారు.
0 comments:
Post a Comment