మాస్
మహారాజ రవితేజ నటిస్తున్న ‘దరువు’ చిత్రానికి సంబంధించిన రోజుకో ఆసక్తికర విషయం బయటకు లీకౌతోంది.
తాజాగా అందిన సమాచారం ప్రకారం
రవితేజ ఇందులో ‘హోం మినిస్టర్’ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో రవితేజ
పాత్ర డిఫరెంట్ షేడ్స్లో కనిపించనుంది. అందులోని
ఒక షేడే ఈ హోం
మినిస్టర్ పాత్ర అని సమాచారం.
అదే విధంగా విక్రమార్కుడు అత్తిలి సత్తిబాబు తరహాలో కామెడీని పంచే ‘బుల్లెట్ రాజా’గా కూడా కనిపించనున్నాడు.
ఈ చిత్రానికి సంబంధించిన బేసిక్ స్టోరీలైన్ చిరంజీవి నటించిన ‘యముడికి మొగుడు’ చిత్రం నుంచి తీసుకున్నారని, దాని
ఆధారంగానే సినిమా రూపొందించారని అంటున్నారు. ఆ చిత్రంలో మాదిరి
హీరో యమలోకానికి వెళ్లడం, యమున్ని తిప్పలు పెట్టడం లాంటి వినోదాత్మక సన్నివేశాలు
ఈచిత్రంలోనూ కనిపించనున్నాయని సమాచారం.
‘ దరువు’ చిత్రాన్ని
శ్రీ వెంకటేశ్వర ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై
శివ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మిస్తున్నారు. రవితేజ సరసన తాప్సీ హీరోయిన్
గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన
ఆడియో రీసెంట్ గా విడుదలైంది. ఈ
ఆడియో విన్నవారు రవితేజ మార్కు సినిమాకు ఏమాత్రం తీసిపోకుండా సినిమా అంటున్నారు. నిర్మాణానంతర కార్యక్రమాల అనంతరం మే 18న చిత్రం
విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
రవితేజ,
తాప్సీ, బ్రహ్మానందం, షాయాజీ షిండే, రఘుబాబు, అవినాష్, సుశాంత్, సన, ఎం.ఎస్.
నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, వెన్నెల కిషోర్, ప్రత్యేక పాత్రలో ప్రభు నటిస్తున్న ఈ
చిత్రానికి కథ-స్ర్కీన్ ప్లే:
శివ, ఆదినారాయణ, మాటలు: రమేష్ గోపి, అనిల్
రావిపూడి, సంగీతం: విజయ్ ఆంథోని, ఎడిటింగ్:
గౌతం రాజు, పాటలు: భాస్కరభట్ల,
రామజోగయ్య శాస్త్రి, సుద్దాల అశోక్ తేజ, ఫోటో
గ్రఫీ: వెట్రివేల్, ఆర్ట్: ఎ.ఎస్. ప్రకాష్,
కో -డైరెక్టర్స్: సత్యం బాబు, ఆది
నారాయణ, అసోసియేట్స్: హరి, రాధా కృష్ణ,
సాయి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చిట్టూరి శ్రీనివాసరావు, సమర్పణ: శ్రీమతి నాగమునీశ్వరి, నిర్మాత: బూరుగుపల్లి శివరామకృష్ణ, కథ-స్క్రీన్ ప్లే,
దర్శకత్వం: శివ
0 comments:
Post a Comment