సూపర్స్టార్ రజనీకాంత్తో 'రోబో' సినిమా
తీసి కోట్లు గడించిన కోలీవుడ్ దర్శకుడు శంకర్ ఇప్పుడు కోట్లు
ఖరీదు చేసే కారులో షికార్లు
చేస్తున్నాడు. శంకర్ ఇటీవలే ఓ
ఖరీదైన లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. ప్రముఖ బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ రోల్స్
రాయిస్ దేశీయ విపణిలో అందిస్తున్న
"ఘోస్ట్" మోడల్ను సుమారు
రూ.3.45 కోట్లు (ప్రత్యేకమైన రిజిస్ట్రేషన్ నెంబర్తో కలిపి) వెచ్చించి
కొనుగోలు చేశాడు.
తమిళనాడులో
అత్యంత ప్రాచుర్యం పొందిన ఈ డైరెక్టర్ శంకర్
తన లగ్జరీ కారును ఇటీవలే చెన్నైలోని కెకె నగర్ ఆర్టిఓ కార్యాలయంలో రిజిస్టర్
చేయించాడు. శంకర్ కొనుగోలు చేసిన
నలుపు రంగు రోల్స్ రాయిస్
ఘోస్ట్ కారు ఆర్టిఓ
ఆఫీసుకు రాగానే అక్కడ ఉన్న వారంతా
ఆ కారుపైనే దృష్టిని నిలిపివేశారు.
వాస్తవానికి
రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారు ఖరీదు రూ.1.25
కోట్లు మాత్రమే. ఇంపోర్ట్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజ్ల కారణంగా
దీని ధర రూ.3.45 కోట్లకు
పెరిగింది. ఇటీవలి బడ్జెట్లో దిగుమతి చేసుకున్న
కార్లపై (సిబియూ రూట్లో) సుంఖాన్ని ప్రభుత్వం 75 శాతానికి పెంచడంతో శంకర్ డ్యూటీ క్రింద
రూ.1.75 కోట్ల మొత్తాన్ని చెల్లించాల్సి
వచ్చింది. ఇకపోతే రిజిస్ట్రేషన్ ఫీజు క్రింద రూ.45
లక్షల మొత్తాన్ని, అలాగే కొంత మొత్తాన్ని
స్పెషల్ నెంబర్ ప్లేట్ (TN09 BQ 0008) కోసం వెచ్చించటం జరిగింది.
(దీన్ని బట్టి చూస్తేంటే శంకర్
లక్కీ నెంబర్ ఎనిమిదిలా ఉంది).
దేశంలో
రోల్స్ రాయిస్ కార్లను కలిగి ఉన్న ఓనర్ల
జాబితాలో శంకర్ కూడా చేరిపోయాడు.
ఇప్పటికే టాలీవుడ్లో చిరంజీవి, బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్,
అమీర్ ఖాన్, సంజయ్ దత్
వంటి ప్రముఖులు కూడా రోల్స్ రాయిస్
కార్లను కలిగి ఉన్నారు. గతంలో
రాజుల కాలంలోనే రోల్స్ రాయిస్ ఇండియాలో ఓ ప్రత్యేక గుర్తింపును
తెచ్చుకుంది. మన నైజాం నవాబులు
కూడా ఓ రోల్స్ రాయిస్
కారును ప్రత్యేకించి ఆర్డర్ చేయించుకున్న బ్రిటన్ నుంచి దిగుమతి చేయించుకున్నారు.
0 comments:
Post a Comment