ఎన్టీఆర్
తాజా చిత్రం దమ్ములో శృతిహాసన్ మొదట్లో హీరోయిన్ గా చేసిన సంగతి
తెలిసిందే. అయితే కొంత షూటింగ్
అయిన తర్వాత ఆమె డేట్స్ ఎడ్జెస్ట్
చేయలేనని ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. ఆమె
అప్పట్లో పది రోజులకు పైగానే
షూటింగ్ లో పాల్గొంది. .అయితే
షూటింగ్ ని ఊసరవెల్లికి బ్రేక్
ఇచ్చి ప్రారంభించటంతో ఆమె సారి చెప్పి
బై చెప్పి వెళ్లిపోయింది.. ఆమె తనకు డేట్స్
లేకపోవటంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు
నుండి తప్పుకున్నట్లు చెప్తున్నారు. అయితే ఆమె వాలంటరిగా
టీమ్ కి గుడ్ లక్
చెప్పి బయిటకు వెళ్లటంతో ఈ మ్యాటర్ ఇష్యా
కాలేదు. కానీ ఆమె చేసినప్పుడు
షూట్ చేసిన పది రోజులకు,ఆమె రెమ్యునేషన్ తో
కలిపి ఐదుకోట్ల రూపాయల వరకూ లాస్ వచ్చిందని
సమాచారం. ఇప్పుడదే ఫిల్మ్ సర్కిల్స్ లో మాట్లాడుకుంటున్నారు.
ఇక అప్పుడు ఎన్టీఆర్ ఈ చిత్రం గురించి
మొదటి నుంచీ...ఆ చిత్రం ఫ్యాన్స్
కి విందు భోజనంలా ఉంటుందని
అని పని గట్టుకుని మరీ
చెప్తున్నారు. అలాగే తాను లావు
తగ్గి చేసే డాన్స్ లు
హైలెట్ గా ఉంటాయని నొక్కి
మరీ చెపున్నారు. భవిష్యత్ లో తాను లావు
గా కనపడనని, గతంలో కనపించినంత లావుగా
కానని,తగ్గిపోతానని,ఆ విషయం దమ్ము
చిత్రం లో గమనించవచ్చునని ఎన్టీఆర్
తన అభిమానులకు హామీ ఇచ్చారు. అలాగే
జూ. ఎన్టీఆర్ ఇక తన దృష్టినంతా
తాజా చిత్రం 'దమ్ము"పై కేంద్రీకరించి చేసాడని
టాక్. బోయపాటి శ్రీను దర్శకత్వంలో క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.యస్.రామారావు
ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 27 న
ఈ చిత్రం విడుదల అవుతోంది.
బాలకృష్ణతో
గత సంవత్సరం 'సింహా"లాంటి విజయవంతమైన చిత్రాన్ని
అందించిన తర్వాత బోయపాటి శ్రీను చేస్తోన్న ఈ చిత్రం పట్ల
ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. పక్కా
మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా
బోయపాటి శ్రీను తనదైన శైలిలో ఈ
చిత్రాన్ని తెరకెక్కించాడని చెప్తున్నారు. ఇక ఎన్టీఆర్ కే
దమ్ము ఉంది. అంతటి మగాడు
అతనే. మీసమున్న ప్రతి ఒక్కడూ మగాడు
కాదు. దమ్మున్నోడే సిసలైన మొనగాడు. అంటే ఒక్క చేత్తో
వంద మందిని కొట్టడం కాదు. ఒక్కరి కోసం
వంద దెబ్బలకు ఎదురు నిలవడం. ఆ
కుర్రాడూ అంతే! నమ్ముకొన్న వారి
కోసం తన దమ్ము చూపించాడు.
అదెలాగో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే
అన్నారు బోయపాటి శ్రీను.
ఈ చిత్రానికి యం.యం.కీరవాణి
సంగీతాన్నందిస్తున్నారు.
ఇక తమిళనాడులోనూ ఈ సినిమాను 25 ప్రింట్లతో
విడుదల చేస్తున్నారు చెన్నై సత్యం ధియోటర్స్ వారు
ఈ రైట్స్ ని ఎస్ పి
ఐ ప్రెవేట్ లిమిటెడ్ పై కొన్నారు. ఈ
మధ్య కాలంలో తమిళంలో ఎక్కువ ప్రింట్లతో రిలిజవుతున్న తెలుగు సినిమా ఇదే అంటున్నారు. త్రిష,
కార్తీక హీరోయిన్స్ గా చేస్తున్న ఈ
చిత్రానికి అలెగ్జాండర్ వల్లభ నిర్మాత. ఈ
చిత్రం విజయంపై దర్శకుడు చాలా కాన్పిడెంట్ గా
ఉన్నారు. ఆయన మాట్లాడుతూ..''ఎన్టీఆర్
దమ్ముని కొత్త కోణంలో ఆవిష్కరిస్తున్నాం.
మాస్ యాక్షన్ అంశాలతో పాటు వినోదం మేళవించాం.
పోరాటాలు ఆకట్టుకొంటాయని అన్నారు.
0 comments:
Post a Comment