సంస్థ:
శ్రీ కీర్తి కంబైన్స్
నటీనటులు:
నందమూరి బాలకృష్ణ, లక్ష్మీరాయ్, సలోని, జయసుధ, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం,
ప్రదీప్రావత్, సుకన్య, రెహమాన్, కాశీ విశ్వనాథ్, మురళీశర్మ,
చరణ్రాజ్, ఎమ్మెస్నారాయణ,
వేణుమాధవ్, ఆదిత్యమీనన్ తదితరులు.
సంగీతం:
కల్యాణి మాలిక్
నిర్మాత:
ఎం.ఎల్.కుమార్చౌదరి
సమర్పణ:
సందీప్.
దర్శకత్వం:
పరుచూరి మురళి
విడుదల:
శుక్రవారం.
శ్రీరామ
రాజ్యం వంటి భక్తి రసాత్మక
చిత్రం తర్వాత బాలకృష్ణ చేసిన ఔట్ అండ్
ఔట్ కమర్షియల్ మూవీ ‘అధినాయకుడు’. తాతగా, తండ్రిగా, తనయుడిగా ఒకదానితో ఒకటి పొంతనలేని పాత్రల్లో
బాలకృష్ణ జీవించిన ఈ చిత్రం ఈ
రోజే భారీ స్ధాయిలో విడుదల
అవుతోంది. రిలీజ్ లో ఇబ్బందులు ఎదురైనా
సినిమా మాత్రం సూపర్ హిట్ టాక్
సొంతం చేసుకుంటుందనే ధీమాగా ఉన్నారు బాలకృష్ణ.
చిత్రం
కథలో హరిశ్చంద్రప్రసాద్ (బాలకృష్ణ) ప్రజల కోసం పోరాడే
మనిషి. ప్రజల తలలో నాలుకగా
మసులుతూ సిసలైన నాయకుడిగా ఎదుగుతాడు. ఆయన ఆశయాల్ని కాపాడే
బాధ్యత తనయుడు రామకృష్ణ ప్రసాద్ (బాలకృష్ణ)పై పడుతుంది. ఆయన
కొడుకు బాబి (బాలకృష్ణ). తాతయ్య,
తండ్రి ఏ ఆశయాల కోసం
బతికారో, ఏ లక్ష్యం కోసం
తమ జీవితాన్ని పణంగా పెట్టారో తెలుసుకొని
అదే మార్గంలో పయనిస్తాడు. ఈ ప్రయాణంలో బాబికి
ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయో తెరపైనే చూడాలి.
దర్శకుడు
చెబుతూ ...నందమూరి బాలకృష్ణ నటన ఈ చిత్రానికి
ప్రధాన ఆకర్షణ. మూడు పాత్రలూ శివుడి
చేతిలో త్రిశూలంలా పదునుగా ఉంటాయి. ప్రతి పాత్ర కథకు
అవసరమే. రాజకీయ కోణంలో సాగినా కుటుంబ విలువలు జోడించడం మర్చిపోలేదు. కల్యాణి మాలిక్ అందించిన బాణీలు మాస్ని ఆకట్టుకొంటాయని
అన్నారు.
నాయకత్వం
వ్యాపారం కాదు... వారసత్వంగా రావటానికి. వెనకనున్న పదిమంది ఆశల్ని, ఆకాంక్షల్ని నెరవేర్చాలి. అప్పుడే నాయకుడు అవుతాడు. అలాంటివాళ్లు మాత్రమే ప్రజల మనసుల్లో స్థానం
సంపాదించుకొంటారు. తరతరాలుగా ప్రజాసేవకు అంకితమై నాయకత్వ లక్షణాల్ని పుణికి పుచ్చుకొన్న ఓ కుటుంబం కథే
మా చిత్రం అంటున్నారు.
0 comments:
Post a Comment