ఆమె నాకు ప్యామిలీ ప్రెండ్..చెల్లెలు లాంటిది..ఆమెను ఎట్లా పెళ్లి
చేసుకుంటాను అంటున్నారు అల్లు శిరీష్. ఫిల్మ్
ఫీల్డ్ కు చెందిన కుటుంబం
అమ్మాయితో ప్రేమలో పడ్డాడని,ఆమెనే పెళ్లిచేసుకోబోతున్నాడని రీసెంట్ గా
మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ నేపధ్యంలో అల్లు
శిరీష్ ఇలా స్పందించారు. అలాగే
..తనుకు మూడు నాలుగేళ్ల వరకూ
పెళ్లి చేసుకునే ఆలోచన లేదని తేల్చి
చెప్పారు.
ఆలాగే
గతంలోనూ నాతో చాలా మందికి
లింక్ లు పెట్టి రాసారు.
అవేమీ నాకు ఎఫెక్టు కావు
కానీ...ఆ అమ్మాయిలు..వారి
కుటుంబాల గురించి ఆలోచించండి...మీడియా వ్యక్తులకు నేను ఒకటే చెప్తున్నా...అటువంటి సెన్సిటివ్ విషయాలను ప్రస్దావించేటప్పుడు ఒకటికి రెండు సార్లు క్రాస్
చెక్ చేసుకోండి అన్నారు అల్లు శిరీష్. అల్లు
అరవింద్ కుమారడైన అల్లు శిరీష్ తన
మ్యారేజ్ రూమర్స్ పై ఇలా క్లారిఫై
చేసాడు. ప్రస్తుతం అల్లు శిరీష్ ..గౌరవం
అనే చిత్రం చేస్తున్నారు. గౌరవం చిత్రాన్ని రాధామోహన్
డైరక్ట్ చేస్తున్నారు. రాధా మోహన్ గతంలో
నాగార్జునతో గగనం చిత్రం రూపొందించారు.
ఇక వివాహ విషయాన్ని అల్లు
శిరీష్ కి చెందిన శ్రేయాభిలాషులు,అతని స్నేహితులు సైతం
ఖండిస్తున్నారు. వారు మీడియాతో మాట్లాడుతూ...అల్లు శిరీష్ వయస్సు
కేవలం 24 సంవత్సరాలు. అతను త్వరలో తమిళంలో
లాంచ్ అవుతున్నాడు. ప్రస్తుతం అతని దృష్టి అంతా
కెరీర్ పైన ఉంది. ఈ
వయస్సులో అతను పెళ్లి ఎట్లా
చేసుకుంటాడు అన్నారు.
అలాగే...శిరీష్,ఆమె చిన్నప్పటి నుంచి
స్నేహితులు. ఆమె ఓ పెద్ద
కుటుంబానికి చెందినది. తెలుగు పరిశ్రమలో ఇద్దరూ చాలా గౌరవనీయమైన కుటుంబాలకి
చెందివారు. ఇటువంటి కథలు వారి మీద
అల్లటం పద్దతి కాదు. వారి స్నేహాన్ని
ఇలా అర్దం చేసుకోవటం సరికాదు.
మరో నాలుగైదు ఏళ్లు అయ్యాక,కెరిర్
లో సెటిల్ అయ్యాక శిరీష్ పెళ్లి చేసుకుంటాడు. ప్రస్తుతం శిరీష్ ..గౌరవం అనే చిత్రంలో
చేస్తున్నాడు. రాధామోహన్ దర్శకత్వంలో ఆ చిత్రం రూపొందనుంది.
బాలీవుడ్ కి చెందిన ఒకమ్మాయిని
హీరోయిన్ గా ఎంపిక చేసాం
అన్నారు.
అల్లు
శిరీష్ ప్రస్తుతం ఏక్టింగ్ ట్రైనింగ్ లో ఉన్నట్లు సమాచారం.
త్వరలోనే తమిళంలో లాంచ్ అవ్వబోతున్నట్లు చెప్తున్నారు.
అందుకోసమే డైలాగు డిక్షన్,యాక్టింగ్ ఎబిలిటీస్ కోసం శిక్షణ తీసుకుంటున్నట్లు
చెప్తున్నారు. గౌరవం చిత్రాన్ని మొదట
నాగచైతన్యతో అనకున్నారు. కానీ బడ్జెట్ పెరిగిపోవటంతో
దాన్ని అల్లు శిరీష్ చేస్తున్నారు.
ప్రకాష్ రాజ్ దాన్ని తెరకెక్కిస్తున్నారు.
భారీగా ఆ చిత్రాన్ని తెలుగులో
సైతం రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.
0 comments:
Post a Comment