రాజమౌళి
తాజాగా తన చిత్రం ఈగ
శాటిలైట్ రైట్స్ గురించి ట్వీట్ చేసారు. ఆ ట్వీట్ లో...మేం ఈగ తమిళ
రైట్స్ ని ఐదు కోట్లకు
అమ్మాము. అప్పుడు ఎక్కువ రేటుకు అమ్ముతున్నామేమో అని వర్రీ అయ్యాం.
ఇప్పుడు తమిళ శాటిలైట్ రైట్స్
3.35 కి అమ్ముడయ్య్యాయి. దాంతో మేం తక్కువ
రేటు కి రైట్స్ ఇచ్చేసామా
అని వండర్ అవుతున్నాం అని
ట్వీట్ చేసారు.
రాజమౌళి
తాజా చిత్రం ‘ఈగ’ఈ నెల 30న
విడుదలకు సిద్దమైన సంగతి తెలిసిందే. ఈ
చిత్రాన్ని తమింళంలో ‘నాన్ ఈ’ టైటిల్ తో విడుదల చేస్తున్నారు.
ఇక ఈ చిత్రం తమిళ
వెర్షన్ శాటిలైర్ రైట్స్ ఓ రేంజిలో పలికి
అందరికీ షాక్ ఇచ్చింది. తమిళంలో
నెంబర్ వన్ ఛానెల్ అయిన
సన్ టీవీ వారు ఈ
చిత్రం శాటిలైట్ రైట్స్ ని 3.35 కోట్లుకు కొనుగోలు చేసారు. ఓ తెలుగు డైరక్టర్
డైరక్ట్ చేసిన చిత్రానికి ఈ
రేంజి రేటు పలకటం తమిళ
శాటిలైట్స్ హిస్టరీలోనే ఓ పెద్ద రికార్డు
అంటున్నారు. నాని, సమంత హీరో
హీరోయిన్లుగా, కన్నడ నటుడు సుదీప్
విలన్ గా నటించిన ఈ
చిత్రం తమిళ వెర్షన్ను
పీవీపీ సినిమా నిర్మిస్తోంది.
‘ఈగ’ సబ్జెక్ట్
సెంట్రల్ పాయింట్ ఏమిటంటే ‘తను ప్రేమించిన అమ్మాయితో
హ్యాపీగా లవ్ స్టోరీ నడుపుతోన్న
ఓ అబ్బాయి అతి క్రూరుడైన విలన్
చేతిలో ప్రాణాలు కోల్సోతాడు. అయితే ‘ఈగ’ రూపంలో మరుజన్మ ఎత్తిన ఆ కుర్రాడిని గత
జన్మ జ్ఝాపకాలు వెంటాడతాయి. దాంతో ‘ఈగ’గానే విలన్ పై
ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తాడు. కాగా తనకంటే ఓ
ఐదు లక్షల రెట్లు శక్తిమంతడైన
ఓ మనిషిపై..అదీ ఓ పరమ
క్రూరుడి పై ఆ ‘ఈగ’ఎలా గెలిచిందీ..ఆ గెలుపు కోసం
ఏమేం చేసిందీ’ అన్నదే క్లుప్తంగా ‘ ఈగ’ కథాంశం.
నాని,
సమంత, సుదీప్ కీలక పాత్రలను పోషించిన
ఈ సినిమా వారాహి చలనచిత్రం పతాకంపై రూపొందింది. ఓ కొత్త పాయింట్తో, ఆసక్తికరమైన కథనంతో
తయారవుతున్న 'ఈగ' సినిమా మీదే
ఇప్పుడందరి దృష్టి ఉంది. అత్యాధునిక సాంకేతిక
నైపుణ్యంతో రూపుదిద్దుకుంటున్న ' ఈగ' చిత్రానికి సంగీతం:
కీరవాణి, కెమెరా: సెంథిల్కుమార్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, కళ: ఎస్.రవీందర్,
స్టైలింగ్: రమా రాజమౌళి, సమర్పణ:
డి.సురేష్బాబు, నిర్మాత: సాయి
కొర్రపాటి, కథ,స్క్రీన్ప్లే,
దర్శకత్వం: ఎస్ .ఎస్. రాజమౌళి.
0 comments:
Post a Comment