తిరుపతి:
రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ బలహీనపడితే ఆంధ్ర ప్రదేశ్ నాలుగు
ముక్కలు అవుతుందని చిన్న నీటి పారుదల
శాఖ మంత్రి టిజి వెంకటేష్ ఆదివారం
అన్నారు. ఆయన చిత్తూరు జిల్లా
తిరుపతి నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారంలో
పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన
మాట్లాడారు. ఉప ఎన్నికలు జరుగుతున్న
నియోజకవర్గాలలో 17 స్థానాలు కడప పార్లమెంటు సభ్యుడు,
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి
పార్టీ నేతలు గెలిచినా ప్రభుత్వానికి
ఎలాంటి డోకా లేదన్నారు.
ఉప ఎన్నికల తర్వాత కూడా కిరణ్ కుమార్
రెడ్డి ప్రభుత్వం ఉంటుందన్నారు. ఓదార్పు యాత్రలు, ధర్నాల పేరుతో జగన్ రాజకీయ ప్రచారం
చేస్తున్నారని మండిపడ్డారు. జగన్కు ఓటేస్తే
రాష్ట్రం ముక్కలవుతుందన్నారు. సమైక్యంగా ఉన్న రాష్ట్రాన్ని విడగొట్టాలని
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్
నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రయత్నాలు చేస్తున్నారని
ధ్వజమెత్తారు.
వయసు
మీద పడటం వల్ల తెలుగుదేశం
పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు వెంటనే తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవిని తన బావమరుదులకు అప్పగించాలని
సూచించారు. ప్రజాధనం దుర్వినియోగం అయిందని తేలితే మంత్రులకు కూడా జైలు శిక్ష
తప్పదన్నారు. పులివెందుల కృష్ణ వల్ల నష్టపోయిన
వారికి జగన్ న్యాయం చేయాలని
హితవు పలికారు.
రాష్ట్రంలో
సంక్షేమ పథకాలు మరింత సమర్థవంతంగా అమలు
చేస్తామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
గుంటూరులో అన్నారు. జిల్లాలో ఉప ఎన్నికల ప్రచారం
ముగించుకొని ఆయన హైదరాబాద్ బయలుదేరారు.
ఈ సమయంలో మీడియాతో మాట్లాడారు. ఇసుక తవ్వకాల అంశం
హైకోర్టు పరిధిలో ఉందని, త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని
చెప్పారు. పత్తిపాడు, మాచర్లలో కాంగ్రెసు పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
0 comments:
Post a Comment