బెంగళూర్:
ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిన సంఘటన విషాదంగా మారింది.
తన గర్ల్ ఫ్రెండ్ ముందు
ఆత్మహత్య నాటకం ఆడడానికి చేసిన
ప్రయత్నం యువకుడి ప్రాణాలు తీసింది. హైసనామ్ జకోయి అనే 22 ఏళ్ల
యువకుడు తన గర్ల్ ఫ్రెండ్
సెరాఫినా (19) ముందు అత్మహత్య నాటకం
ఆడడానికి ప్రయత్నించాడు. ప్లాస్టిక్ కుర్చీపై నిలబడి దాన్ని తన్నేస్తానని చెప్పిన యువకుడి ప్రాణాలు కుర్చీ జారిపోవడంతో సీలింగ్ ఫ్యాన్కు వేలాడి మరణించాడు.
ఈ సంఘటన బెంగళూర్లోని
బన్నెర్గట్ట రోడ్ ఫ్లాట్లో చోటు చేసుకుంది.
ఇంఫాల్కు చెందిన హైస్నామ్,
సెరాఫినా మూడేళ్లుగా డేటింగ్ చేస్తున్నారు. చదువు అయిపోయిన తర్వాత
పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అయితే, ఇద్దరి మధ్య ఇటీవలే పొరపొచ్చాలు
వచ్చాయి. గర్ల్ ఫ్రెండ్ తనను
పట్టించుకోవడం లేదని హైస్నామ్ భావించాడు.
వారం రోజులుగా సెరాఫినా అతని కాల్స్కి
పలకడం లేదు, సందేశాలకు సమాధానం
ఇవ్వడం లేదు.
గురవారం
రాత్రి 11 గంటల ప్రాంతంలో హైస్నామ్
ఫ్లాట్లో ఇద్దరు కలుసుకున్నారు.
హైస్నామ్ సెరాఫినాతో వాదించడం ప్రారంభించాడు. తనను మోసం చేస్తే
చచ్చిపోతానని అతను బెదిరించాడు. సరుకులను
సర్దుతూ ఆమె అతని బెదిరింపులను
పట్టించుకోలేదు. తరుచుగా అతను అలాంటి బెదిరింపులు
చేస్తూనే ఉన్నాడని ఆమె అన్నది
అతను
నైలాన్ తాడు తీసుకుని పద్ధతి
మార్చుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. అలానే బెదిరిస్తుంటాడని ఆమె
నిర్లక్షం చేసింది. కుర్చీపైకి ఎక్కి నైలాన్ తాడును
మెడకు తగిలించుకున్నాడు. మరో చివరను ఫ్యాన్కు కట్టాడు. తాడును
మెడకు బిగించుకుని ఆమెను బెదిరించ సాగాడు.
అకస్మాత్తుగా కాళ్ల కింది నుంచి
కుర్చీ జారిపోయింది. దాంతో అతను గాలిలో
తేలాడు. నైలాన్ తాడు మెడకు బిగుసుకుంది.
దాంతో ఆమె అరిచి గీపెట్టింది.
దాంతో మిత్రులు లోనికి పరుగెత్తుకొచ్చారు. అతన్ని ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు. అయితే ఫలితం లేకుండా
పోయింది.
0 comments:
Post a Comment