హైదరాబాద్:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి పత్రిక అంటే కిరణ్ కుమార్
రెడ్డి ప్రభుత్వానికి భయమని వైయస్సార్ కాంగ్రెసు
పార్టీ నేత రోజా శనివారం
అన్నారు. సాక్షి అంటే కిరణ్ ప్రభుత్వం
ఎంతగా భయపడుతుందో వాళ్లు జారీ చేస్తున్న నల్ల
జివోలను జారీ చూస్తే అర్థమవుతోందన్నారు.
సాక్షి మీడియాపై కక్షగట్టి సిఎం విడుదల చేస్తున్న
జివోలు రాష్ట్ర చరిత్రలో మాయని మచ్చ అన్నారు.
ఇవి ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం
అన్నారు.
సాక్షి
ఖాతాల స్తంభన, 10 ప్రకటనలు నిలిపివేస్తూ జివో జారీ ఇలా
వరుసగా జగన్ పై ప్రభుత్వం
కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటోందన్నారు. ప్రభుత్వపు మూర్ఘపు చర్యలపై హైకోర్టు స్టే విధించిందన్నారు. ఇది
జరిగి 24 గంటలు గడవకముందే సాక్షి
ఆస్తులను అటాచ్ చేసేందుకు సిబిఐకి
అనుమతిస్తూ జివోను విడుదల చేసిందని మండిపడ్డారు.
కిరణ్
చేస్తున్న నల్ల చేష్టలను ప్రజలు
గమనిస్తున్నారన్నారు. ప్రభుత్వం చేసిన సిగ్గుమాలిన పనిని
ఎలా చెప్పుకోవాలో తెలియక జివోలను రహస్యంగా ఉంచారన్నారు. నల్ల జివోల జారీ
అధికారం సిఎంకు ఎక్కడిదన్నారు. కాంగ్రెసు పార్టీ, దానికి బ్రాంచి ఆఫీసుగా మారిన టిడిపి నేతలు
జగన్ ఆస్తులపై చేస్తున్న దుష్ప్రచారాలలో ఒక్కదానినైనా నిరూ పించగలరా అని
సవాల్ చేశారు. కేసుల గురించి ఎవరిని
విచారించాలో వారి వారి మనస్సాక్షిని
అడిగితే తెలుస్తుందని కాంగ్రెసు, టిడిపి నేతలకు హితవు పలికారు.
జగన్
కంపెనీలలోకి పెట్టుబడులు ఏకపక్షంగా వచ్చాయని చెబుతున్న సిబిఐ, ఐఏఎస్, మంత్రులపై నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందన్నారు. అడ్డగోలు విచారణతో జగన్ను దోషిగా
ఇరికించడానికి కాంగ్రెసు, టిడిపిలు కలిసి సిబిఐ చేత
ఆడిస్తున్న నాటకాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. కిరణ్ ప్రభుత్వం విడుదల
చేసిన నల్ల జివోల నుంచి
ప్రజల దృష్టి మరల్చేందుకే సబితను సిబిఐ విచారించినట్లు డ్రామాను
తెరపైకి తీసుకు వచ్చారని రోజా ఆరోపించారు.
సాక్షి
మీడియాను అటాచ్ చేస్తూ విడుదల
చేసిన నల్ల జివోపై మంత్రి
సబితకు సంతకం పెట్టే నైతిక
హక్కు ఉందా అన్నారు. ఆమె
కూడా విచారణ ఎదుర్కొంటున్నప్పుడు సంతకం ఎలా చేస్తారన్నారు.
ఉప ఎన్నికలలో డిపాజిట్లు కూడా దక్కవని సర్వేలు,
ఇంటెలిజన్స్ నివేదికలు చెప్తున్న నేపథ్యంలో కిరణ్ దిక్కుతోచక సాక్షి
గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. జగన్పై ఎన్ని
విమర్శలు చేసినా, ఎంతగా దుష్ర్పచారం చేసినా
ప్రజలు నమ్మరన్నారు.
0 comments:
Post a Comment