ఏలూరు:
సిబిఐ తనను అరెస్టు చేసి
జైలుకు పంపుతుందనే భయంతోనే యాత్ర పేరుతో ప్రజల
సానుభూతిని పోగు చేసుకోవడానికి వైయస్సార్
కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఎంపి కావూరి సాంబశివ
రావు శనివారం అన్నారు. ఆయన పశ్చిమ గోదావరి
జిల్లా టి.నరసాపురంలో పోలవరం
కాంగ్రెసు అభ్య్రర్థి పార్వతితో కలిసి ఉప ఎన్నికల
ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జగన్
ఆరోపిస్తున్నట్లుగా సిబిఐ, కాంగ్రెసు పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పారు.
చట్టం తన పని తాను
చేసుకు పోతోందన్నారు. అరెస్టు భయంతోనే జగన్ ఓదార్పు యాత్రలు
నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. దోచుకున్న వారు దాచుకున్న వారే
తప్ప వైయస్సార్ కాంగ్రెసులో త్యాగం చేసిన వారు ఒక్కరన్నా
ఉన్నారా అని రాష్ట్ర ప్రాథమిక
విద్యాశాఖ మంత్రి శైలజానాథ్ అనంతపురంలో ప్రశ్నించారు.
నిజాయితీ,
నిబద్ధతతో పని చేసిన ఘనత
నీలం సంజీవరెడ్డికి దక్కిందన్నారు. అలాంటి నేత జగన్ పార్టీలో
ఒక్కరైనా ఉన్నారా ్న్నారు. అవిశ్వాస తీర్మానంలో మోసగాళ్లుగా గుర్తించి బయటకు పంపితే జగన్
వర్గం ఎమ్మెల్యేలు త్యాగం చేశామని గొప్పలు చెప్పుకోవడం దురాణమన్నారు. రాష్ట్రంలో నాగార్జున సాగర్, జిల్లాలోని ఎంపిఆర్ ప్రాజెక్టులు కూడా వారే నిర్మించారని
చెప్పినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని ఎద్దేవా
చేశారు.
ఇప్పుడున్న
పరిస్థితుల్లో కాంగ్రెసు పార్టీకి ఒక పత్రిక కావాలని,
దీన్ని దృష్టిలో పెట్టుకొని సాక్షి దిన పత్రికను కాంగ్రెసు
పార్టీ టేకాఫ్ చేసుకోవాలని, కాంగ్రెసు పార్టీ కోసమే దివంగత ముఖ్యమంత్రి
వైయస్ రాజశేఖర రెడ్డి ఆ పత్రికను, ఛానల్ను ప్రారంభించారని మాజీ
మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి
అన్నారు.
పత్రికను,
ఛానల్ను ప్రభుత్వం కానీ,
కాంగ్రెసు కానీ తీసుకుంటే మేలన్నారు.
దీంతో అందులో పని చేసే ఉద్యోగులకు,
ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు.
ఇది తన వ్యక్తిగత అభిప్రాయం
మాత్రమేనని స్పష్టం చేశారు. జిల్లాలో ఉన్న బ్రాహ్మిణి ఉక్కు
కర్మాగారాన్ని సెయిల్ సంస్థ టేకోవర్ చేసుకుంటుందని
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
ఇదివరకే ప్రకటించారని గుర్తు చేశారు.
0 comments:
Post a Comment