ఇంత పెద్ద విజయం సాధించినందుకు
అభినందించడానికి ఇంటికెళ్తే, పవన్ తోట పని
చేసుకొంటూ సాదాసీదాగా కనిపించారు. అలాంటి వ్యక్తిత్వం ఆయనకు మాత్రమే సొంతమని
నిర్మాత బండ్ల గణేష్ అన్నారు.
పవన్ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్
సింగ్ విజయోత్సాహంలో ఉన్న గణేష్ మీడియాతో
మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే
ఎనభై ఒక్క సంవత్సరాల చలనచిత్ర
బాక్సాఫీస్ చరిత్రను తిరగరాసి, విడుదలైన అన్ని కేంద్రాలలో విజయఢంకా
మోగిస్తున్న గబ్బర్ సింగ్కు మొదటినుండి
అనేక మంది కష్టపడి పనిచేశారని,
వారి కృషికి, ఈ విజయానికి వెల
కట్టలేమని, అమెరికాలో విడుదలై టాప్త్రీగా తమ
చిత్రం కొనసాగుతుండడం ఆనందాన్నిస్తోందని తెలిపారు.
ఇక హరీష్ శంకర్ మాట్లాడుతూ...''సానుకూల దృక్పథంతో ఈ సినిమా మొదలుపెట్టాం.
పవన్ కళ్యాణ్ ఇచ్చిన ప్రోత్సాహం మర్చిపోలేనిది. ఉదయం 'దేఖొ దెఖొ
గబ్బర్ సింగ్', సాయంత్రం 'పిల్లా నువ్వు లేని' పాటలు తెరకెక్కించాక
కూడా, రాత్రి డబ్బింగ్ చెప్పడానికి వచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే
మమ్మల్ని పరుగులు పెట్టించారు. ఇదంతా సినిమాని అనుకొన్న
సమయానికి విడుదల చేయాలనే తపనతోనే'' అన్నారు.
''తూ
‘గబ్బర్ సింగ్’ అని ఏరోజున పవన్
కళ్యాణ్ ఈ చిత్రానికి పేరు
పెట్టారో ఆ రోజునుండి పాజిటివ్
థింకింగ్ అందరికీ పెరిగిపోయిందని, నార్త్ ఇండియా హిట్ చిత్రం దబాంగ్ను సౌత్ ఇండియా
చిత్రంగా చేయడానికి అనేక మార్పులు చేశామని,
ఆ మార్పులన్నీ ప్రేక్షకులు మెచ్చుకున్నందువల్ల ఇంత విజయం దక్కిందని,
ఈ సమ్మర్లో విడుదల చేసి
హిట్ కొట్టాలన్న కోరికతో యూనిట్ మొత్తం అహర్నిశలు శ్రమించిందని, ఆ శ్రమకు ఫలితమే
ఈ రోజు దక్కిన విజయం.
ఈ సినిమా బాగా ఆడుతుందంటే దానికి
కారణం ఒకరో ఇద్దరో కాదు.
ఇది సమష్టి కృషి. అందరూ కష్టపడితే
ఫలితం ఎంత బాగుంటుందో చెప్పడానికి
మా సినిమా ఓ నిదర్శనం '' అన్నారు.
ఇక తెలుగునాట పవన్ కళ్యాణ్ గబ్బర్
సింగ్ సృష్టిస్తున్న ప్రభంజనం చిన్నది కాదని, దీని గురించి ఎంత
చెప్పినా తక్కువే కనుక సూపర్ హిట్
దాటితే బ్లాక్ బస్టర్ అంటారని, అది కూడా దాటితే
పవన్ కళ్యాణ్ సినిమాగా చెప్పవచ్చని, ఆ రేంజ్ ఇప్పుడు
‘గబ్బర్ సింగ్’కు దక్కిందని దర్శకుడు
హరీష్ శంకర్ తెలిపారు.
0 comments:
Post a Comment