ఒంగోలు:
1978లో రెండెకరాలతో రాజకీయాలలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు
అన్ని కోట్ల ఆస్తులు ఎక్కడివి
అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి శనివారం కిరణ్ కుమార్ రెడ్డి
ప్రభుత్వాన్ని, సిబిఐని ప్రశ్నించారు. చంద్రబాబు కేంద్ర హోంమంత్రి చిదంబరాన్ని కలిసినందుకే ఆయన ఆస్తులపై విచారణ
జరగడం లేదని ఆరోపించారు.
శ్రీ
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొవూరు ఉప ఎన్నికలలో అధికార
కాంగ్రెసు పార్టీయే రూ.1000 కోట్లు పంచిదని ఆరోపించారు. అవినీతి చేసింది మీరైతే నన్ను తప్పు పడుతున్నారని
ప్రశ్నించారు. రాష్ట్రంలో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు కలిసికట్టుగా పనిచేస్తూ రాజకీయాలను కలుషితం చేశాయని విమర్శించారు. ఉప ఎన్నికల తర్వాత
రాష్ట్రంలో సమూల మార్పులు సంభవిస్తాయని
అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో శనివారం జరిగిన సభలో ఆయన మాట్లాడారు.
రైతులు,
పేద ప్రజల సంక్షేమం కోసం
అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని ఆయన
విజ్ఞప్తి చేశారు. తాను ఢిల్లీ పెద్దలకు
తలవంచడం లేదు కాబట్టే తనపై
విచారణ జరుగుతోందని, బాబు ఆర్ధరాత్రి వారిని
కలుస్తున్నారని కాబట్టే ఆయనపై విచారణ జరగడం
లేదన్నారు. వారు చేస్తున్న తప్పులను
ఎవరు చూసినా చూడకపోయినా పైనున్న దేవుడు చూస్తున్నారన్నారు. చంద్రబాబు, కాంగ్రెసు పెద్దల కుమ్మక్కు ఏ స్థాయిలో ఉందో
చెప్పాలంటే సిబిఐ దర్యాఫ్తు తీరు
చూస్తే అర్థమవుతోందన్నారు.
నిమ్మగడ్డ
ప్రసాద్ చేసిన తప్పేమిటని, ఆయనను
ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నించారు. పరిశ్రమలు స్థాపించి వేలాది మందికి ఉపాధి కల్పించడానికి దివంగత
ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి
భూములు లీజుకిచ్చారని తప్పు పట్టడమేమిటని ప్రశ్నించారు.
అవినీతిపై చంద్రబాబు, కిరణ్ మాట్లాడటం విడ్డూరంగా
ఉందన్నారు.
0 comments:
Post a Comment