నెల్లూరు:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డికి యుగయుగాల శిక్ష చాలదని విజయవాడ
పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ శనివారం అన్నారు. రాష్టవ్యాప్తంగా స్వచ్ఛంద సంస్థల ద్వారా సర్వే చేయిస్తే మెజారిటీ
ప్రజలు జగన్ను ఎందుకు
అరెస్టు చేయరాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారని అన్నారు. వైయస్ జగన్ జన్మలో
ముఖ్యమంత్రి కాలేరని విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్
తేల్చిచెప్పారు.
ఒకవేళ
జగన్కే ముఖ్యమంత్రిగా అవకాశం
లభిస్తే బంగారం ధర పెరిగినందున మహిళల
మెడల్లోని పుస్తెలు లాక్కున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.
జగన్ నెల రోజుల్లో జైలుకు
వెళ్లడం ఖాయమని స్పష్టం చేశారు. సిబిఐ చార్జిషీట్లో
జగన్ అవినీతి, అక్రమాలకు సంబంధించి వివరాలు స్పష్టంగా ఉన్నాయన్నారు. నెలరోజుల్లో ఆయన జైలుకు వెళ్లడం
తథ్యమని అన్నారు. జగన్ను జైలుకు
పంపాలన్నదే జనాభిప్రాయం కూడా అన్నారు.
దీనిపై
ప్రజా బ్యాలెట్ పెట్టి ఎన్నికలు జరిపినా కడప జిల్లాలో మినహా
అన్ని జిల్లాల వారు జగన్ను
జైలుకు పంపాలనే తీర్పు చెబుతారన్నారు. ఆయన వేలకోట్లు దోచుకొని
సానుభూతి కోసం ప్రజల్లో తిరుగుతున్నారన్నారు.
ఆయన సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన వారు మాత్రం జైలుకు
వెళుతున్నారన్నారు. జగన్కు మానవత్వం
ఉంటే పెట్టుబడిదారుల నుంచి తీసుకున్న డబ్బును
వెనక్కి ఇచ్చి తన నిజాయితీ
నిరుపించుకోవాలన్నారు.
జగన్ను నిజంగానే కాంగ్రెస్
కన్నెర్ర చేస్తే, ఇబ్బంది పెట్టాలనుకుంటే జగన్ ఏమవుతారో ఆలోచించాలన్నారు.
ఉప ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు
ఒక్కసీటు కూడా జగన్ పార్టీకి
దక్కదని... రాయలసీమలోనూ ఆయనకు ఆదరణ తగ్గిందని
లగడపాటి తెలిపారు. జగన్ కంపెనీల్లో తన
సోదరుడు కూడా పెట్టుబడులు పెట్టిన
అంశంపై స్పందిస్తూ... తన సోదరుడు లగడపాటి
శ్రీధర్ పెట్టుబడులు పెట్టినప్పటికీ, ప్రభుత్వం నుంచి ఎలాంటి మేలు
పొందలేదని స్పష్టం చేశారు.
రూ.లక్ష తీసుకున్న బిజెపి
నేత బంగారు లక్ష్మణ్కు నాలుగేళ్ల జైలు
శిక్ష వేస్తే జగన్కు యుగయుగాల
శిక్ష విధించవచ్చన్నారు. మ్యాట్రిక్స్ ప్రసాద్ కష్టపడి సంపాదించుకొని జగన్ సంస్థలకు కప్పంలా
రూ.800 కోట్ల పెట్టుబడి పెట్టారన్నారు.
ఆయన ప్రస్తుతం బాధల్లో ఉన్నారన్నారు. మానవత్వం ఉంటే పెట్టుబడి పెట్టిన
డబ్బును జగన్ తిరిగి ఇవ్వాలని,
కానీ ఒక్క రూపాయి కూడా
ఇవ్వడని లగడపాటి వ్యాఖ్యానించారు.
0 comments:
Post a Comment