హైదరాబాద్:
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై,
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన ప్రదేశ్ కాంగ్రెసు
కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి
బొత్స సత్యనారాయణ శుక్రవారం తీవ్రమైన విమర్శలు చేశారు. చంద్రబాబు, వైయస్ జగన్ ఢిల్లీ
వీధుల్లో తెలుగువారి ఆత్మగౌరవం తాకట్టు పెట్టారని కాంగ్రెసుపై విమర్శలు చేయడం విడ్డూరమన్నారు.
మాది
టిడిపిలా కుటుంబ పార్టీ కాదని చెప్పారు. జాతీయ
దృక్పథంతో ఆలోచించే నేషనల్ పార్టీ అని చెప్పారు. పరిపాలనలో
ఒక పద్ధతి, విధానం ఉంటుందని చెప్పారు. ఆ ఆలోచనతో, దృష్టితోనే
మేం ముందుకు వెళతామని చెప్పారు. కుటుంబ పార్టీల మాదిరిగా కాంగ్రెసు నేతలు రాత్రికో మాట
పగలో మాట చెప్పరన్నారు. ఒకటి
రెండు రోజుల్లో ఉప ఎన్నికల కాంగ్రెసు
పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు.
చంద్రబాబు,
జగన్ చేసే విమర్శలు రాజకీయ
లబ్ధి కోసమే అన్నారు. ఆత్మగౌరవంపై
మీకు ఎంత గౌరవం ఉందో
అందరికీ తెలుసునన్నారు. ప్రజల్లోని క్షణికావేశాన్ని కొందరు వాడుకోవాలని చూస్తున్నారన్నారు. కాంగ్రెసు పార్టీ జయాపజయాల గురించి చూసే పార్టీ ఏమాత్రం
కాదన్నారు. ఫలితాలు కాంగ్రెసుకు అనుకూలంగా వస్తాయని చెప్పారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ దేవతే అన్నారు.
పార్టీకి
చెందిన నేతలు ఇక నుండి
బహిరంగంగా పరస్పర విమర్శలు చేసుకోరని బొత్స చెప్పారు. రెండు
మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలపై నేతలందరితో మాట్లాడానని, ఇక నుంచి వారు
ఇలాంటి వ్యాఖ్యలు చేయరని చెప్పారు. ఏవైనా భేదాభిప్రాయాలు ఉంటే
అంతర్గతంగా పార్టీలో చెబుతారన్నారు. ఏ దేశంలో అయినా,
ఏ పార్టీలోనైనా పక్కవారు ఏం చేస్తున్నారో తెలుసుకునే
వ్యవస్థ ఉండటం సహజమేనని బొత్స
చెప్పారు.
సమ్మారావు
వ్యవహారంలో గండ్ర వెంకట రమణ
రెడ్డితో మాట్లాడానని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని
జగన్ వీధిలోకి తీసుకు వచ్చి వేలెత్తి చూపే
పరిస్థితి కల్పించారని మండిపడ్డారు. కేవలం వైయస్ ఆస్తికే
జగన్ వారసుడని, రాజకీయ వారసుడు కాదని బొత్స సత్యనారాయణ
మరోమారు చెప్పారు.
0 comments:
Post a Comment