కడప:
తాను బిజెపితో కలుస్తున్నట్లు అప్పుడు ప్రచారం చేశారని, ఆ పాచిక పారలేదని,
దాంతో ఇప్పుడు తిరుమలేశుడి దర్శనాన్ని రాజకీయం చేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అన్నారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు
పీఠాధిపతులను ఎందుకు కలుస్తున్నారని, తానేం తప్పు చేశానని
ఆయన అడిగారు. కడప జిల్లా రాజంపేట
శాసనసభా నియోజకవర్గంలో ఆయన శుక్రవారం ఉప
ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
కడప ఉప ఎన్నికల్లో చంద్రబాబునాయుడు,
ఎల్లో మీడియా, కాంగ్రెసు కుమ్మక్కయినట్లు ఆయన ఆరోపించారు. తమ
పార్టీ రాజంపేట అభ్యర్థి అమర్నాథ్ రెడ్డి్ రైతులకు అండగా నిలిచారని ఆయన
కొనియాడారు. రాజంపేట రోడ్ షో మధ్యలో
వైయస్ జగన్ అమ్మవారి శాలలో
కన్యకాపరమేశ్వరిని దర్సించుకున్నారు.
వైయస్
జగన్ వెంట నడవడం తనకు
గర్వంగా ఉందని రాజంపేట వైయస్సార్
కాంగ్రెసు పార్టీ అభ్యర్థి అమర్నాథ్ రెడ్డి అన్నారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ
ప్రజల కోసం పోరాడుతున్న జగన్
అని ఆయన ప్రశంసించారు. 2004, 2009 ఎన్నికల్లో దివంగత
నేత వైయస్ రాజశేఖర రెడ్డిని
చూసే ప్రజలు కాంగ్రెసు పార్టీకి ఓటేశారని ఆయన అన్నారు.
రాష్ట్రంలోని
18 శానససభా స్థానాలకు, ఓ లోకసభ స్థానానికి
ఉప ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. కడప
జిల్లాలోని స్థానాలకు జరిగే ఉప ఎన్నికలను
వైయస్ జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
ఎటువంటి పరిస్థితిలోనూ జిల్లాలోని అన్ని స్థానాలను గెలుచుకోవాలనే
పట్టుదలతో ఆయన ఉన్నారు. దీంతో
విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నారు.
0 comments:
Post a Comment