హైదరాబాద్:
నట్టి కుమార్ తన కాలి గోటితో
సమానమని నిర్మాత సి.కళ్యాణ్ మంగళవారం
మండిపడ్డారు. ఆయన మధ్యాహ్నం విలేకరుల
సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన
మాట్లాడారు. ఒకరిని మోసం చేయడం తనకు
తెలియదన్నారు. తాను తప్పు చేసినట్టు
తెలితే అందరి ముందు శిక్షించ
వచ్చునని చెప్పారు. నట్టి కుమార్ పేరే
తాను పలకకూడదనుకున్నానని అన్నారు. నట్టి నిత్యం తనపై
ఆరోపణలు చేస్తున్న సమయంలో పలువురు ఆయన వ్యాఖ్యలను ఖండించమని
సలహా ఇచ్చారన్నారు.
అయితే
ఓ కేసు విచారణలో ఉన్న
సమయంలో మాట్లాడకూడదనే తాను మిన్నకుండి పోయానని
చెప్పారు. తనపై నట్టి చేసిన
ఆరోపణలు అవాస్తవమన్నారు. తనపై ఆరోపణలు చేసిన
నట్టి మూడు రోజులలో ఆధారాలతో
సహా బయట పెడతానని వారం
రోజుల క్రితం చెప్పాడని, కానీ ఇప్పటి వరకు
ఏమీ చెప్పలేదన్నారు. ఆధారాలు ఉంటే నిరూపించాలని సవాల్
చేశారు.
తాను
ఇప్పుడు నట్టి కుమార్ పైన
ఆధారాలతో సహా వచ్చానని చెప్పారు.
నట్టి తన బాలాజి కలర్
ల్యాబ్కు వచ్చింది కేవలం
రెండుసార్లు మాత్రమే అన్నారు. బ్లాక్ మెయిల్ చేయడం అతనికి అలవాటే
అన్నారు. రజనీకాంత్ అల్లుడు ధనుష్ త్రీ చిత్రానికి
తనకు ఏం సంబంధమని ఆయన
ప్రశ్నించారు. డబ్బులు నొక్కేసిన నట్టి అందరిపై ఆరోపణలు
చేస్తుంటాడన్నారు. చిన్న నిర్మాతలను లోబర్చుకొని
నిత్యం బ్లాక్ మెయిల్ చేస్తుంటారన్నారు.
నట్టి
కుమార్ పైన ఫిర్యాదు చేసిన
సుందర్ ఎవరో తనకు తెలియదని,
కానీ ఆయన వెనుక తాను
ఉన్నానని నట్టి ఆరోపించడం విడ్డూరమన్నారు.
సుందర్ పేరే తాను మొదటిసారి
వింటున్నానని చెప్పారు. మద్దెలచెర్వు సూరి హత్య కేసులో
ప్రధాన నిందితుడు భాను కిరణ్తో
తనకేం సంబంధమన్నారు. భాను ఎప్పుడు వచ్చాడు,
ఎక్కడి నుండి వచ్చాడన్నాు. తాను
ఎప్పుడు సినీ రంగంలోకి వచ్చానని
అన్నారు. 182 సినిమాలను విడుదల చేసినట్లు చెప్పారు.
కాగా
భాను కిరణ్తో లింక్స్
పైన సి.కళ్యాణ్ నోరు
జారారు. విజయవాడకు చెందిన అన్నపూర్ణ ప్యాకేజ్ విషయంపై ఆయన మాట్లాడారు. ఆ
కుటుంబం ఇబ్బందులు పడుతుంటే సమస్యను పరిష్కరించాలని తానే భాను కిరణ్ను పురమాయించానని చెప్పారు.
తాను భాను కిరణ్ను
కలిసింది ఆ ఒక్కసారే అని
చెప్పారు.
0 comments:
Post a Comment