హీరోయిన్
శ్రియ రేటు విషయంలో చాలా
చీప్ అయిపోయింది. అసలు అవకశాలే లేక
అల్లాడుతున్న అమ్ముడు ఏదైనా అవకాశం వస్తే
వదలకుండా, తన చేయి జారి
పోకుండా ఉండటానికి ట్రై చేస్తోంది. అవసరం
అయితే రెమ్యూనరేషన్ తగ్గించుకోవడానికి కూడా వెనకాడటం లేదు.
ఇటీవల
శ్రియకు కన్నడలో ‘చంద్ర’ అనే ఓ సినిమాలో
ఆఫర్ వచ్చింది. సాండల్వుడ్లో పాగా
వేయడానికి ఇదే మంచి తరుణం
అని భావించిన శ్రియ సాధారణంగా తను
తీసుకునే రూ. 70-80 లక్షల రెమ్యూనరేషన్ కంటే
తక్కువ రేటుకే ఒప్పేసుకుంది. కన్నడ మార్కెట్ తక్కువగా
ఉండటం కూడా శ్రియ రెమ్యూనరేషన్
తగ్గించుకోవడానికి ఓ కారణం అంటున్నారు.
వాస్తవానికి
ఈచిత్రంలో తొలుత కన్నడ భామ
రమ్యను తీసుకోవాలని అనుకున్నారు. అయితే రమ్య ఈ
చిత్రంలో నటించడానికి నిరాకరించింది. ఆ తర్వాత అమలాపాల్,
దియా మీర్జా, అమృతరావు తదితరులను అనుకున్నప్పటికీ చివరకు శ్రియను ఫైనల్ చేసేశారు.
ఈ చిత్రంలో శ్రియ మహారాణిగా చంద్రగా
కనిపించ బోతోంది. ఈచిత్రం తనకు మంచి గుర్తింపు
తెస్తుందని భావిస్తోంది. రూపా లైర్ దర్శకత్వం
వహిస్తున్న ఈచిత్రంలో రమ్యకృష్ణ, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంలు ముఖ్య
పాత్రల్లో కనిపించనున్నారు. మరి ఈ సినిమాతోనైనా
మళ్లీ శ్రియ పుంజుకుంటుందో లేదో
చూడాలి.
0 comments:
Post a Comment