పవర్
స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన
‘గబ్బర్ సింగ్’ చిత్రంలో పంచ్ డైలాగులు బాగా
పేలిన నేపథ్యంలో సినిమా సూపర్ డూపర్ హిట్
అయిన సంగతి తెలిసిందే. ఈ
చిత్రం భారీ విజయం సాధించిన
నేపథ్యంలో దర్శకుడు త్రివిక్రమ్కు ప్రెషర్ మరింత
ఎక్కువైంది. పవర్ స్టార్తో
ఆయన త్వరలో తీయబోయే చిత్రం హిట్ అవ్వాలన్నా, అభిమానుల
అంచనాలను అందుకోవాలన్నా....గబ్బర్ సింగ్ చిత్రాన్ని మించిత ఎంటర్టైన్మెంట్ అందులో
ఉండాలి. ఈ విషయాన్ని పసిగట్టిన
త్రివిక్రమ్ ఇప్పటి నుంచే అందుకు సన్నద్దం
అవుతున్నారు.
పవన్
కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న ఈ చిత్రం షూటింగ్
ఆగస్టు ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి కూడా
జల్సా హీరోయిన్ ఇలియానాను సంప్రదిస్తున్నప్పటికీ ఇంకా ఖరారు కాలేదు.
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బేనర్పై బివిఎస్ఎన్
ప్రసాద్ నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం
త్రివిక్రమ్ ‘జులాయి’ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఈచిత్రాన్ని జూన్ నెలలో విడుదల
చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరో వైపు పవన్
కళ్యాణ్ కూడా పూరి దర్శకత్వంలో
కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో
నటిస్తున్నాడు.
వీరిద్దరు
చేస్తున్న ఈరెండు ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత....జల్సా2 చిత్రం ప్రారంభం కానుంది. గతంలో పవన్, త్రివిక్రమ్
కాంబినేషన్లో వచ్చిన ‘జల్సా’ చిత్రం మంచి విజయం సాధించిన
నేపథ్యంలో తర్వాతి ప్రాజెక్టుపై కూడా భారీ
అంచనాలు నెలకొన్నాయి.
0 comments:
Post a Comment