ఏలూరు:
భారతీయ జనతా పార్టీ సీనియర్
నేత బంగారు లక్ష్మణ్ రూ.లక్ష తీసుకున్నందుకు
కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తే,
తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని లక్షల
కోట్లు దోచుకున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఎన్ని యుగాల శిక్ష
విధిస్తే సరిపోతుందని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. లగడపాటి గురువారం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారానికి
వెళ్లారు.
ఈ సందర్భంగా తణుకులో విలేకరులతోను, అనంతరం మొగల్తూరు మండలంలో ప్రచారసభల్లోను జగన్పై తీవ్రస్థాయిలో
విరుచుకుపడ్డారు. జగన్ను నమ్మి
పెట్టుబడులు పెట్టిన పారిశ్రామిక వేత్తలు జైళ్లలో మగ్గుతుంటే ఈయన మాత్రం సానుభూతిని
అడ్డు పెట్టుకుని అధికారం కోసం ప్రచారం చేసుకుంటున్నారన్నారు.
రాష్ట్ర పారిశ్రామిక వేత్తల నుంచి కోట్లు దండుకుంటే
దర్యాప్తు సంస్థలు, కోర్టు కళ్లు మూసుకుని కూర్చోవాలా
అని, ఇష్టానుసారం దండుకోవడమే అధికారానికి అర్థమా అని, ఆయన పత్రికలోకి
రూ. 2వేల కోట్ల పెట్టుబడులు
ఎలా వచ్చాయని లగడపాటి ప్రశ్నించారు.
అది కూడా కాంగ్రెస్ కుట్రేనా
అన్నారు. తండ్రి అధికారంతో సంపాదించిన సొమ్మును జప్తు చేసే అధికారం
దర్యాప్తు సంస్థకు, కోర్టులకు ఉందన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఎప్పుడూ యువతను ప్రోత్సహిస్తోందన్నారు. దాంట్లో భాగంగానే నాకు, జగన్కు
అవకాశం ఇచ్చిందన్నారు. కానీ కానీ జగన్
దాన్ని వినియోగించుకోలేదన్నారు. పార్టీకి కష్టకాలంలో ఉపయోగపడకుండా వేరుకుంపటి పెట్టుకున్నాడని మండిపడ్డారు.
త్వరలో
జగన్ అరెస్టు ఖాయమని, ఆ తర్వాత ఆయన
కుటుంబం మీ గ్రామాల్లో పర్యటించి
మొసలి కన్నీరు కారిస్తే కరిగిపోవద్దని హితవు పలికారు. సహనానికి
ఒక హద్దు ఉంటుందని, శంకర్దాదా ఎంబిబిఎస్లో
చిరంజీవి చెప్పినట్టు రెండు చెంపలూ వాయించినా
తిరిగి స్పందించకపోతే అది చేతకానితనమే అవుతుందన్నారు.
నిగర్వి, అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి కొత్తపల్లి సుబ్బారాయుడును గెలిపించడం ద్వారా నరసాపురం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చని
ఆయన విజ్ఞప్తి చేశారు.
ప్రజల్లో
సానుభూతి పెంచుకునేందుకు జగన్ చెబుతున్న మాటలను
విని మోసపోవద్దని రాజగోపాల్ అన్నారు. తణుకు ఎమ్మెల్యే కారుమూరి
వెంకట నాగేశ్వరరావు నివాసంలో కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు. సానుభూతి కోసం జగన్ చెబుతున్న
మాయమాటలను నమ్మవద్దని పేర్కొన్నారు. గతంలో దొంగతనాలు చేసినా,
హత్యలు చేసినా చట్టాలలో ఉన్న లొసుగుల ఆధారంగా
ధీమాగా ఉండేవారని చెప్పారు. ఈ మధ్య కాలంలో
దర్యాప్తు సంస్థలు వ్యవహరిస్తున్న తీరును బట్టి అవినీతికి పాల్పడిన
వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని చెప్పారు.
ముఖ్యమంత్రిగా
వైయస్ రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ఎవరైనా.. ఉన్న పథకాలను మెరుగుపరుస్తూ
ప్రజలకు అందించేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. అవినీతికి పాల్పడిన వారు మూలన కూర్చోకుండా
ప్రజల్లోకి వెళ్లి తనను తాను నిజాయితీపరుడిగా
చెప్పుకోవడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. రాజకీయ నాయకులు వ్యాపారం చేయడం తప్పు కాదని,
చేసే వ్యాపారం సక్రమ మార్గంలో ఉండాలని
అన్నారు.
రాష్ట్ర
పారిశ్రామికవేత్తల నుండి కోట్ల రూపాయలు
దండుకుంటుంటే దర్యాఫ్తు సంస్థలు, కోర్టులు కళ్లు మూసుకోవాలా అని
ప్రశ్నించారు. జరిగిన దోపిడీ, ద్రోహం ప్రజలకు ఇప్పుడిపిప్పుడే అర్థమవుతోందన్నారు. జగన్ మాటలకు ప్రతి
ఒక్కరిలో ఆవేశం ఉప్పొంగుతోందని, ఇష్టానుసారం
మాట్లాడితే సహించేది లేదన్నారు.
0 comments:
Post a Comment