హీరో
మోటోకార్ప్ అందిస్తున్న బడ్జెట్ బైక్స్ స్ప్లెండర్, ప్యాషన్ బ్రాండ్లను టార్గెట్ చేస్తూ..
జపాన్ ద్విచక్ర వాహన దిగ్గజం హోండా
మోటార్స్ తాజాగా మార్కెట్లోకి "డ్రీమ్ యుగ" అనే 110సీసీ బడ్జెట్ బైక్ను మార్కెట్లోకి ప్రవేశపెట్టిన
సంగతి తెలిసిందే. ఈ చీప్ అండ్
బెస్ట్ బైక్కు మార్కెటింగ్
ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు గానూ బాలీవుడ్ నటుడు
అక్షయ్ కుమార్ని తమ బ్రాండ్
అంబాసిడర్గా హోండా నియమించుకుంది.
హోండాతో
తన తొలి అసోసియేషన్లో
భాగంగా, అక్షయ్ కుమార్ మొదటగా డ్రీమ్ యుగ 110సీసీ బైక్ కోసం
ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు తమ
బ్రాండ్ అంబాసిడర్గా అక్షయ్ కుమార్తో హోండా ఐదేళ్ల
పాటు ఓ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
ఈ ఒప్పందం విలువ సుమారు రూ.50
కోట్లు (ఏడాదికి రూ.10 కోట్లు చొప్పున)గా ఉండొచ్చనే గుసగుసలు
వినిపిస్తున్నాయి. ఇండియన్ మార్కెట్ కోసం హోండా మొట్టమొదటి
బ్రాండ్ అంబాసిడర్ను నియమించుకుంది.
మార్కెట్లో
ఏదైనా మంచి ఉత్పత్తికి ఆదరణ
లభించాలంటే దానికి బలమైన బ్రాండ్ ప్రమోషన్
అవసరం. ఇప్పుడిప్పుడే ద్విచక్ర వాహన మార్కెట్లో దూసుకుపోతున్న
హోండాకు బాలీవుడ్లో మంచి ఫేమ్
కలిగిన అక్షయ్ కుమార్ ప్రచారకర్తగా వ్యవహరించడంతో, హోండా మరింత వెలుగులోకి
వచ్చే ఆస్కారం ఉంది. ధర, మైలేజ్,
స్టయిలిష్ లుక్ కోరుకునే వారిని
దృష్టిలో ఉంచుకొని ఇటు పవర్, పెర్ఫామెన్స్లతో పాటు అటు
మెయింటినెన్స్, రన్నింగ్ కాస్ట్‌ల పరంగా ఉత్తమంగా
ఉండేలా డ్రీమ్ యుగ మోటార్సైకిల్ను హోండా అభివృద్ధి
చేసింది.
చూడటానికి
పాత మోడల్ హోండా షైన్
బైక్లా అనిపించే హోండా
డ్రీమ్ యుగ 110సీసీ బైక్ లీటర్
పెట్రోల్కు 72 కి.మీ.
మైలేజీనిస్తుంది. డ్రీమ్ యుగ ప్రారంభ ధర
కేవలం 44,642 రూపాయలు మాత్రమే. దీనిని 110సీసీ, సింగిల్ సిలిండర్
ఇంజన్ 7500 ఆర్పిఎమ్ వద్ద
9పిఎస్‌ల శక్తిని విడుదల
చేస్తుంది. ఇది మూడు వేరియంట్లు,
ఐదు ఆకర్షనీయమైన రంగుల్లో లభ్యమవుతుంది.
ఇంకా
ఇందులో సెల్ఫ్ స్టార్ట్, అల్లాయ్ వీల్స్, పొడవైన సీట్, ఫుల్ చైన్
కవర్, హీలో-టో గేర్
షిఫ్ట్ లివర్, ట్యూబ్లెస్ టైర్స్ వంటి
ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ
ప్రస్తుతం సెగ్మెంట్లోని బజాజ్ డిస్కవర్, టీవీఎస్
స్టార్ సిటీ, హీరో ప్యాషన్
ప్రో, స్ప్లెండర్ ప్రో, యహమా వైబిఆర్
తాజాగా విడుదలైన సుజుకి హయాటే వంటి మోడళ్లకు
110సీసీ హోండా డ్రీమ్ యుగ
మోటార్సైకిల్ గట్టి పోటీ ఇవ్వనుంది.
0 comments:
Post a Comment