పవన్
కళ్యాణ్ తాజా చిత్రం 'గబ్బర్సింగ్' కలెక్షన్స్ పరంగా కొత్త రికార్డులను
క్రియేట్ చేస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. హిందీ
హిట్ చిత్రం దబాంగ్ రీమేక్ గా రూపొందిన ఈ
చిత్రం ఇప్పుడు హిందీ డబ్బింగ్ రైట్స్అమ్ముడవుతున్నాయి.
ఆ రేటు యాభై లక్షలు.
ఈ రైట్స్ కోసం పెద్ద పెద్ద
హిందీ ఛానెల్స్ పోటీ పడుతున్నట్లు సమాచారం.
సాధారణంగా ఓ సినిమా హిట్
అయితే హిందీలో దాని డబ్బింగ్ రైట్స్
ఇవరై లక్షలు దాకా రావటం చాలా
గొప్ప విషయం. అయితే ఈ సారి
అది 50 లక్షలకు పలికి అందరిని ఆశ్చర్యపరుస్తోంది.
ముఖ్యంగా హిందీ రీమేక్ చిత్రాన్ని
హిందీలోకి డబ్ చేసి రైట్స్
ఈ రేంజిలో అమ్మటం చాలా గొప్ప విషయం
అని ట్రేడ్ లో చెప్పుకుంటున్నారు.
ఇక సినిమా విజయం పై దర్శకుడు
హరీష్ శంకర్ స్పదిస్తూ... 'గబ్బర్సింగ్' సినిమా ఫలితంతో నేనొక దర్శకుడిగా కంటే...
పవన్‌కల్యాణ్ అభిమానిగా ఎక్కువ సంతోషిస్తున్నాను.'తొలిప్రేమ', 'ఖుషి' చిత్రాల తర్వాత
మళ్లీ అసలు సిసలైన పవన్‌కల్యాణ్ సినిమాని చూపించారని అభిమానులు అంటున్నారు. తొలి రోజు, తొలి
ఆటే ప్రేక్షకుల మధ్య కూర్చొని చూశాను.
ప్రతి సన్నివేశాన్నీ వాళ్లు ఎంతగానో ఆస్వాదిస్తున్నారు. పరిశ్రమ నుంచి కూడా ఎంతోమంది
స్పందించారు. రాజమౌళి, వినాయక్, శ్రీను వైట్ల తదితర దర్శకులంతా పవన్కల్యాణ్ని చాలా శక్తిమంతంగా
తెరపై చూపించావని అభినందించడం ఆనందాన్నిచ్చింది అన్నారు.
సినిమా
సక్సెస్ వెనక సీక్రెట్ వివరిస్తూ...
సినిమా అనేది ప్రేక్షకులందరికీ నచ్చాలి.
అభిమానులకు ఇంకొంచెం ఎక్కువ నచ్చాలి. ఈ సూత్రాన్ని దృష్టిలో
ఉంచుకొని పని చేశాను.''అన్నారు
హరీష్ శంకర్. ఇక ''హిట్టు..ప్లాప్
లను నమ్ముకొని నేను పరిశ్రమకు రాలేదు.
కేవలం పనిని నమ్ముకొని వచ్చాను.
వరుసగా రెండు విజయాలు అందుకోవడమంటే...
ఒక దర్శకుడిగా నాపై మరింత బాధ్యత
పెరిగినట్లే అని ఖచ్చితంగా చెప్పారు.
దబాంగ్
లో మార్పులు చేయటంపై స్పందిస్తూ...హిట్టన సినిమా అయినా తెలుగులు చేసేటప్పుడు
మార్పలు అవసరమే. మన ప్రేక్షకుల అభిరుచి,
మన హీరోల ఇమేజ్కి
తగ్గ విధంగా మంచి మార్పులు చేసుకోవాలి.
'దబాంగ్'లో హీరో లంచం
తీసుకోవడం ఉంటుంది. కానీ నా వరకూ
అది నచ్చలేదు. మార్చాను. 'దబాంగ్' కథ బాలీవుడ్కి
కొత్తే. దానికి భిన్నంగా సినిమా తియ్యాలని కొన్ని మార్పులు చేశాను. ఇదొక రీమేక్ చిత్రం
కాబట్టి... మన నేపథ్యానికి అనుగుణంగా
చాలా మార్పులే చేసుకొన్నాం. 'దబాంగ్'లోని ప్రతి సన్నివేశాన్నీ
విశ్లేషిస్తూ ఈ స్క్రిప్ట్ని
సిద్ధం చేశాం. అందుకే కొంచెం ప్రాసతో మాటలు, మార్పులు అని రాశాను. వినోదంలో
భాగంగానే ఆ ఆలోచన వచ్చింది.
మేం ఊహించినట్టుగానే థియేటర్లో నవ్వుకోవడం అక్కడ్నుంచే మొదలైంది అంటూ హరీష్ శంకర్
వివరించారు.
0 comments:
Post a Comment