తక్కువ
ధరలో ఎక్కువ మైలేజీనిచ్చే బైక్ కావాలని కోరుకుంటున్నారా..?
అయితే, మీ కోసమే హోండా
ఓ సరికొత్త మోటార్సైకిల్ను మార్కెట్లోకి తీసుకువచ్చింది.
గడచిన జనవరిలో జరిగిన 2012 ఢిల్లీ ఆటో ఎక్స్పోలో
మొట్టమొదటి సారిగా హోండా ఆవిష్కరించిన 110సీసీ
బడ్జెట్ బైక్ "డ్రీమ్ యుగ" మోటార్సైకిల్ను కంపెనీ నేడు
వాణిజ్య పరంగా మార్కెట్లోకి అందుబాటులోకి
తీసుకువచ్చింది.
అత్యంత
ఆకర్షనీయమైన ధరకే హోండా డ్రీమ్
యుగ మోటార్సైకిల్ను అందిస్తుంది. ఇది
చూడటానికి పాత మోడల్ హోండా
షైన్ బైక్లా అనిపిస్తుంది.
లీటర్ పెట్రోల్కు 72 కి.మీ.
మైలేజీనిచ్చే హోండా డ్రీమ్ యుగ
మోటార్సైకిల్, మైలేజ్ కోరుకునే వారి కలను నిజం
చేయనుంది. భారత మార్కెట్లో డ్రీమ్
యుగ ప్రారంభ ధర కేవలం 44,642 రూపాయలు
మాత్రమే.
ఇందులో
ఉపయోగించిన 110సీసీ, సింగిల్ సిలిండర్
ఇంజన్ 7500 ఆర్పిఎమ్ వద్ద
9పిఎస్‌ల శక్తిని విడుదల
చేస్తుంది. ఇది మూడు వేరియంట్ల
(కిక్ స్టార్ట్ + డ్రమ్ బ్రేక్స్ + స్పోక్
వీల్స్, కిక్ స్టార్ట్ + డ్రమ్
బ్రేక్స్ + అల్లాయ్ వీల్స్, సెల్ఫ్ స్టార్ట్ + డ్రమ్ బ్రేక్స్ + అల్లాయ్
వీల్స్)లో ఐదు ఆకర్షనీయమైన
రంగుల్లో (బ్లాక్, మాన్సూన్ గ్రే
మెటాలిక్, ఆల్ఫా రెడ్ మెటాలిక్,
ఫోర్స్ సిల్వర్ మెటాలిక్, మాపిల్ బ్రౌన్ మెటాలిక్) లభ్యమవుతుంది.
సెల్ఫ్
స్టార్ట్, అల్లాయ్ వీల్స్, పొడవైన సీట్, ఫుల్ చైన్
కవర్, హీలో-టో గేర్
షిఫ్ట్ లివర్, ట్యూబ్లెస్ టైర్స్ వంటి
ఫీచర్లతో హోండా డ్రీమ్ యుగ
లభ్యమవుతుంది. ఈ ప్రస్తుతం సెగ్మెంట్లోని
బజాజ్ డిస్కవర్, టీవీఎస్ స్టార్ సిటీ, హీరో ప్యాషన్
ప్రో, స్ప్లెండర్ ప్రో, యహమా వైబిఆర్
తాజాగా విడుదలైన సుజుకి హయాటే వంటి మోడళ్లకు
110సీసీ హోండా డ్రీమ్ యుగ
మోటార్సైకిల్ గట్టి పోటీ ఇవ్వనుంది.

0 comments:
Post a Comment