ఒకటి,
రెండు, మూడు, నాలుగు...రోజులు
గడిచి పోయాయి. పవర్ స్టార్ పవన్
కళ్యాణ్ నటించిన ‘గబ్బర్ సింగ్’ చిత్రానికి ఫ్లో ఏమాత్రం తగ్గడం
లేదు. చిత్రం హిట్ టాక్ దవానలంలా
వ్యాపించడంతో సినిమా చూడానికి వచ్చే వారి సంఖ్య
రోజు రోజుకు విపరీతంగా పెరుగుతోంది. నైజాం ఏరియాలో రిలీజ్
చేసిన థియేటర్ల సంఖ్య కంటే రెట్టింపు
జన ప్రవాహం ఉండటంతో థియేటర్ల సంఖ్యను కూడా పెంచారంటే పరిస్థితి
అర్థం చేసుకోవచ్చు.
మరో రెండు వారాల పాటు
ఇదే ప్లో కొనసాగితే....తెలుగు
సినిమా చరిత్రలో ఇప్పటి వరకు రికార్డుల పరంగా
టాప్లో ఉన్న ‘మగధీర’ రికార్డు
తుడిచి పెట్టుకు పోవడం ఖాయం అని
ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఇలా పదేళ్ల తర్వాత
పవన్ తన విశ్వరూపాన్ని చూపుతుండటంపై
అభిమానులు తెగ ఆనందపడిపోతున్నారు.
పరిస్థితి
చూస్తుంటే గబ్బర్సింగ్ ప్లో నిరాటంకంగా
కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. మరో రెండు వారాల
వరకు పవన్ కళ్యాణ్కి
సరిపడా పోటీదారులు బరిలో నిలవడం లేదు.
రవితేజ ‘దరువు’
25న, రాజమౌళి ‘ఈగ’ చిత్రం 30 విడుదలవుతున్నప్పటికీ వాటి ప్రభావం ‘గబ్బర్
సింగ్’
చిత్రంపై ఉండదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
పవన్
కళ్యాణ్ సరసన శృతి హాసన్
హీరో హీరోయిన్లుగా నటించిన ఈచిత్రంలో మలైకా అరోరా, అభిమన్యు
సింగ్, కోట శ్రీనివాసరావు, సుహాసిని,
బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అజయ్, నాగినీడు,
రావు రమేష్, గిరి, ఫిష్ వెంకట్,
ప్రభాస్ శ్రీను, అలీ, సత్యం రాజేష్,
మాస్టర్ ఆకాష్, మాస్టర్ నాగన్, ప్రవీణ్, మర్ల శ్రీను, కాభీభట్ల
ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఫోటో
గ్రఫీ : జైనన్ విన్సెంట్, సంగీతం
: దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్ : బ్రహ్మ కడలి, ఎడిటింగ్ : గౌతం
రాజు, స్ర్కీన్ ప్లే : రమేష్ రెడ్డి, వేగేశ్న
సతీష్, డాన్స్ : దినేష్, గణేష్, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ప్రొడక్షన్
కంట్రోలర్ : డి. బ్రహ్మానందం, సమర్పణ
: శివబాబు బండ్ల, నిర్మాత : బండ్ల గణేష్, స్క్రీప్లే,
మాటలు, దర్శకత్వం : హరీష్ శంకర్
0 comments:
Post a Comment