యంగ్
టైగర్ జూనియర్ ఎన్టీఆర్, శ్రీను వైట్ల కాంబినేషన్లో రూపొంద
బోతున్న ‘బాద్ షా’ చిత్రం జూన్ 1 నుంచి రెగ్యులర్ షూటింగ్
జరుపుకోబోతోంది. దర్శకుడు శ్రీను వైట్ల, అతని టీం గత
కొన్ని రోజులుగా ఊటీలో మకాం వేసి
సినిమా ప్లానింగ్ అంతా పూర్తి చేశారు.
తొలి
షెడ్యూల్ ఇటలీలో ప్లాన్ చేశారు. చిత్రానికి సంబంధించిన మేజర్ పార్టు ఇక్కడే
చిత్రీకరించనున్నారు. ఈచిత్రంలో జూ ఎన్టీఆర్ సరసన
కాజల్ అగర్వాల్ రొమాన్స్ చేస్తోంది. గతంలో బృందావనం చిత్రంలో
జూనియర్కి తగిన జోడీ
అనిపించుకున్న కాజల్ అగర్వాల్ మరోసారి
యంగ్ టైగర్ సరసన అవకాశం
దక్కించుకుంది.
గతంలో
రెడీ, దూకుడు లాంటి విజయవంతమైన ఎంటర్
టైన్మెంట్ చిత్రాలను రూపొందించిన శ్రీను వైట్ల.....‘బాద్ షా’ చిత్రాన్ని కూడా హిల్లోరియస్, అండ్
యాక్షన్ ఎలిమెంట్స్‌తో రూపొందిస్తున్నారు. సినిమాలో పంచ్
డైలాగులు, కామెడీ సీన్లు బాగా దట్టించమే కాకుండా....దుమ్మురేపే యాక్షన్ సన్నివేశాలు కూడా ప్లాన్ చేశారు.
శ్రీపరమేశ్వర
ఆర్ట్స్ బేనర్పై బండ్ల
గణేష్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా...కోన వెంకట్, గోపీ
మోహన్ స్క్రిప్టు రచయితలుగా పని చేస్తున్నారు. క్రేజీ
కాంబినేషన్, దూకుడు చిత్రానికి పని చేసిన సాంకేతిక
వర్గం ఈచిత్రానికి పని చేస్తుండటంతో సినిమాపై
మంచి అంచనాలున్నాయి.
0 comments:
Post a Comment