ఉప ఎన్నికల్లో కాంగ్రెసు తరఫున ప్రచారం చేయడానికి
రాజ్యసభ సభ్యుడు, వైయస్ రాజశేఖర రెడ్డి
ప్రియ మిత్రుడు కెవిపి రామచందర్ రావు దూకుతున్నారు. పార్టీ
పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ పత్తిపాడు నుంచి తలపెట్టిన ప్రజాహిత
పాదయాత్ర కార్యక్రమంలో ఆయన పాల్గొంటున్నారు. దీంతో
ఆయన వైయస్ జగన్పై
ఏ విధమైన వ్యాఖ్యలు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇంత వరకు ఆయన
వైయస్ జగన్పై ఆయన
నోరు విప్పలేదు. చాలా కాలంగా పార్టీ
కార్యకలాపాల్లో అంతగా కనిపించడం లేదు.
వైఎస్
రాజశేఖరరెడ్డి మరణించిన తర్వాత గాంధీభవన్లో జరిగిన కార్యకర్తల
సమావేశంలో ఒకసారి మాట్లాడారు. పార్టీని బలోపేతం చేయడానికి అందరూ కృషి చేయాలని
పిలుపునిచ్చారు. తర్వాత రాజ్యసభలో సమైక్యవాణిని వినిపించారు. అంతేతప్ప ప్రచారపర్వంలో ఆయన మాట్లాడగా ఎవరూ
వినలేదు. అలాంటిది ఆయన గుంటూరు జిల్లా
ప్రత్తిపాడు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి టీజేఆర్ సుధాకర్బాబు తరఫున రంగంలోకి
దిగి స్వయంగా ప్రచారం చేయడానికి సిద్ధపడ్డారు. వైయస్ రాజశేఖర రెడ్డి
కుమారుడు జగన్ కూడా అదే
జిల్లాలో ఉండగా ఆయన ముందుకు
దూకుతుననారు.
తాను
వ్యక్తుల జోలికి వెళ్లేది లేదని కెవిపి అన్నారు.
కేంద్రంలోను, రాష్ట్రంలోను తమ ప్రభుత్వాలు చేపడుతున్న
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
బుధవారం ప్రత్తిపాడులో ప్రచారం చేస్తున్న సందర్భంగా ఆయన ఓ ప్రముఖ
దినపత్రికతో మాట్లాడారు. తాను ప్రత్తిపాడు అభ్యర్థి
సుధాకర్బాబు విజయం కోసం
ప్రచారం చేస్తున్నానని అన్నారు.
తన ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తానని చెప్పారు. కాంగ్రెస్ గురించి చెప్పేందుకు చాలా ఉందని, ఆ
పథకాలే అభ్యర్థుల విజయానికి దోహదపడతాయని అన్నారు. అలాంటప్పుడు వేరే అంశాలను ప్రస్తావించాల్సిన
అవసరం ఏముందని ప్రశ్నించారు. అయితే.. కేవీపీ ప్రచారం చేస్తున్నారంటే.. జగన్ గురించి ఏం
మాట్లాడతారోనన్న కుతూహలం సహజంగా ఉంటుంది కదా అన్నప్పుడు - వ్యక్తుల
గురించి మాట్లాడటం అప్రస్తుతం అని జవాబిచ్చారు.
0 comments:
Post a Comment