హైదరాబాద్:
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ)
ఎదుట హాజరయ్యేందుకు తనకు గడువు కావాలని
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం సిబిఐని కోరారు. జగన్ తరఫు న్యాయవాదులు
ఇద్దరు ఉదయం హైదరాబాదులోని సిబిఐ
కార్యాలయం దిల్ కుషా అతిథి
గృహానికి వచ్చారు. జగన్ సిబిఐ ఎదుట,
కోర్టులో హాజరయ్యేందుకు సమయమివ్వాలని వారు కోరారు.
జగన్
ఉప ఎన్నికల బిజీలో ఉన్నందున వచ్చే నెల అనగా
జూన్ 15వ తేదిన విచారణకు
హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని గడువు కోరారు. అయితే
జగన్ తరఫు న్యాయవాదులు ఇచ్చిన
లేఖను సిబిఐ అధికారులు తీసుకోలేదని
తెలుస్తోంది. సంబంధింత అధికారులు లేనందున తాము లేఖ తీసుకోలేదని
సిబిఐ కార్యాలయ వర్గాలు జగన్ తరఫు న్యాయవాదులకు
చెప్పినట్లుగా తెలుస్తోంది.
మరోవైపు
తమ ఎదుట ఈ నెల
25న విచారణకు హాజరు కావాలని వైయస్
జగన్మోహన్ రెడ్డికి నోటీసులు అందించేందుకు సిబిఐ అధికారులు గుంటూరు
జిల్లాకు చేరుకున్నారు. నోటీసులు ఇచ్చేందుకు తమకు సమయం ఇవ్వాలని
అధికారులు జగన్ను కోరారు.
అందుకు జగన్ ఉదయం పదకొండు
గంటలకు రెంటచింతల చర్చిలో తనను కలవాలని సిబిఐకి
చెప్పారు.
దీంతో
వారు పదకొండు గంటల సమయంలో రెంటచింతల
చర్చిలో జగన్‌కు నోటీసులు
అందజేసే అవకాశాలు ఉన్నాయి. సిబిఐ అధికారులు మాచర్ల
నుండి రెంటచింతలకు బయలుదేరినట్లుగా తెలుస్తోంది. కాగా జగన్కు
సిబిఐ నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన నేపథ్యంలో ఆయన అరెస్టు 28 కంటే
ముందే జరగనుందనే ప్రచారం జోరుగా జరుగుతోంది.
మరోవైపు
మంత్రి మోపిదేవి వెంకట రమణ పదకొండు
గంటలకు సిబిఐ ఎదుట హాజరు
కానున్నారు. వాన్ పిక్ కు
భూకేటాయింపులపై మోపిదేవిని సిబిఐ ప్రశ్నించనుంది.
0 comments:
Post a Comment