హైదరాబాద్/న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో వరుసగా రెండో ఏడాది కూడా
అమ్మాయిలే తొలి రెండు స్థానాలకు
దక్కించుకున్నారు. 2011 సివిల్ సర్వీసెస్ పరీక్షల ఫలితాలను యుపిఎస్సీ శుక్రవారం విడుదల చేసింది. అఖిల భారత వైద్య
విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) నుంచి ఎంబిబిఎస్ పట్టా
తీసుకున్న షేనా అగర్వాల్కు
ప్రథమ స్థానం లభించింది. ముంబై టాటా ఇనిస్టిట్యూట్
ఆఫ్ సోషల్ సైన్సెస్లో
పిజి చేసిన రుక్మిణి రియార్
రెండో స్థానంలో నిలిచారు.
ఆంధ్రప్రదేశ్కు చెందిన కృష్ణ
భాస్కర్కు 9వ ర్యాంకు
వచ్చింది. అతిని ఐఏఎస్ అధికారి
డి.లక్ష్మీపార్థసారథి కుమారుడు. పాలవ్యాపారి కుమారుడు కూడా ఐఎఎస్ కాబోతున్నాడు.
సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఎ
మల్లికార్జున్కు 20వ ర్యాంక్
వచ్చింది. సివిల్స్ 2011లో రాష్ట్రంలోనే తొలి
రెండు స్థానాల్లో నిలిచిన టాపర్లు వీరు.
కృష్ణభాస్కర్
ఆలిండియా స్థాయిలో 9వ ర్యాంకు సాధించగా,
ఎ.మల్లికార్జున 20వ ర్యాంకు సాధించారు.
రాష్ట్రానికి దాదాపు 50 వరకూ ర్యాంకులు వచ్చాయి.
2011 అక్టోబర్-నవంబర్ మాసాల్లో రాతపరీక్ష, ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ నెలల్లో ఇంటర్వ్యూలను నిర్వహించిన అనంతరం యూపీఎస్సీ ఈ ఫలితాలను
ప్రకటించింది.
మొత్తం
910 మంది అభ్యర్థులను ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఇతర కేంద్ర సర్వీసులకు
సిఫారసు చేసింది. ఐఏఎస్లో 170, ఐపీఎస్లో 150, ఐఎఫ్ఎస్లో 40, కేంద్రసర్వీసులు గ్రూప్ ఏలో 543, గ్రూప్ బిలో 98 ఖాళీలను ఈ అభ్యర్థులతో భర్తీ
చేస్తారు. 187 మంది అభ్యర్థుల రిజర్వు
లిస్టును కూడా యూపీఎస్సీ
ఖరారు చేసింది. ఆలిండియా స్థాయిలో షెనా అగర్వాల్ (రోల్
నెం.233541) మొదటిస్థానంలో నిలవగా.. రెండోస్థానంలో రుక్మిణి రియర్ (రోల్నెం.27895) నిలిచింది.
మూడోస్థానం ప్రిన్స్ధావన్ (రోల్నెం.1804)కు
దక్కింది.
0 comments:
Post a Comment