విజయవాడ:
తనకు ఎలాంటి సన్ స్ట్రోక్ తగలలేదని
మంత్రి పార్థసారథి బుధవారం అన్నారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని భూకబ్జా ఆరోపణలపై ఆయన విజయవాడలో మీడియా
సమావేశంలో వివరణ ఇచ్చారు. ఈ
సందర్భంగా ఆయన మాట్లాడారు. తాను
కానీ, తన తనయుడు గాని
ఎలాంటి భూకబ్జాలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఆదేశాల మేరకే తాను భూమిని
కొనుగోలు చేసినట్లు చెప్పారు.
నిబంధనల
ప్రకారమే పూర్తిగా నడుచుకున్నానని అన్నారు. తన కుమారుడిపై వచ్చిన
ఆరోపణలు పూర్తిగా నిరాధారమన్నారు. తన తనయుడికి చదువు
తప్ప మరో వ్యాపకం లేదన్నారు.
తన తనయుడు ఓ మంచి స్టూడెంట్
అని, తాను మూడేళ్లుగా మంత్రిగా
ఉన్నప్పటికీ ఒక్కసారైనా ఏదైనా రాజకీయ కార్యక్రమంలో
పాల్గొన్నారా అని ప్రశ్నించారు. కనీసం
తన పక్కన కూడా ఎప్పుడూ
ఎవరూ తన తనయుడిని చూసి
ఉండరన్నారు.
తనకు
ఎలాంటి సన్ స్ట్రోక్ తగలలేదని,
తనపై ఆరోపణలు చేసిన వారికే ఫాదర్
స్ట్రోక్ తగిలిందన్నారు. తనపై రాజకీయ దురుద్దేశ్యంతోనే
విపక్షాలు దానిని రాద్ధాంతే చేస్తున్నాయన్నారు. అభ్యంతరాలు ఉన్న వారు కోర్టుకు
వెళ్లి తేల్చుకునే అవకాశం ఉన్నప్పటికీ తనపై బురదజల్లే ప్రయత్నాలు
చేస్తున్నారన్నారు.
కోర్టులో
రిజిస్ట్రేషన్ తప్పు అని తేలితే
తాను భూమిని వదులుకునేందుకు సిద్ధమన్నారు. అంతేకాదు తన మంత్రి పదవికి
రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. రిజిస్ట్రేషన్
తప్పుడుది కాదని కోర్టే స్వయంగా
చెప్పిందని తెలిపారు. తన తనయుడు భూకబ్జా
చేశాడని నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తానన్నారు.
0 comments:
Post a Comment