విశాఖపట్నం:
విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రొఫెసర్పై లైంగిక వేధింపుల
కేసు నమోదైంది. ఓ పరిశోధక విద్యార్థినిని
విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ లైంగిక వాంఛ తీర్చాలని ఒత్తిడి
చేశాడనే వార్తలు విశ్వవిద్యాలయంలో అట్టుడుకుతున్నాయి. ఓ బాధితురాలి తల్లిదండ్రులు
ప్రొఫెసర్పై సోమవారం విశ్వవిద్యాలయం
అధికార వర్గాలకు ఫిర్యాదు చేశాయి.
మెటీరియాలజీ,
ఓసియనోగ్రఫీ విభాగానికి చెందిన ఓ ప్రొఫెసర్ వారం
క్రితం అట్మాస్ఫియరిక్ సైన్సైస్కు చెందిన ఓ
విద్యార్థినిని వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ విషయాన్ని ఆమె
తన తల్లిదండ్రులకు తెలిపింది. ప్రొఫెసర్ తన లైంగిక వాంఛ
తీర్చాలని ఒత్తిడి తెచ్చాడని అంతకు ముందు ఓ
విద్యార్థిని అధికారులకు ఫిర్యాదు చేసింది.
అయితే,
తనకు ఇంత వరకు ఏ
విధమైన ఫిర్యాదు అందలేదని ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్
కళాశాల ప్రిన్సిపాల్ వీరయ్య చెప్పారు. టీచింగ్ ఫ్యాకల్టీపై గతంలో కూడా లైంగిక
వేధింపుల ఆరోపణలు వచ్చాయి.
ఎంసిఐ
నిబంధనలను ఉల్లంఘించి ప్రైవేట్ కళాశాలలకు అనుబంధతను ప్రసాదించడంలో నిబంధనలను ఉల్లంఘించారని సిబిఐ తన చార్జిషీటులో
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఫార్మసీ కళాశాలకు చెందిన నలుగురు టీచింగ్ ఫ్యాకల్టీ సభ్యుల పేర్లను చేర్చింది.
0 comments:
Post a Comment