వైయస్సార్
కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని
ఈ నెల 25వ తేదీన
అరెస్టు చేస్తారని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు.
అలా భావించడానికి కారణం ఉంది. వైయస్
జగన్ను అవినీతిపరుడిగా, చెడ్డ
వ్యక్తిగా ఎల్లో మీడియా చిత్రీకరించినప్పటికీ
ఆయన కడప లోకసభ స్థానంలో
భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఉప
ఎన్నికల్లో కూడా ఆయన పార్టీ
గెలిచే అవకాశం ఉంది. ఇదే అందరూ
అలా భావించడానికి కారణం. ప్రజాదరణ వల్లనే జగన్ను అరెస్టు
చేయడానికి రంగం సిద్దం చేసినట్లు
నాకు అనిపిస్తోంది.
రాష్ట్ర
రాజకీయాల్లో స్టార్లా ముందుకు వచ్చిన
వైయస్ జగన్ ముందు కిరణ్
కుమార్ రెడ్డి, చిరంజీవి, బొత్స సత్యనారాయణ, చంద్రబాబు
నాయుడు వంటి నాయకులు వెలవెలబోతున్నారు.
ఎన్నికల్లో వైయస్ జగన్ను
ఎదుర్కోలేమని ప్రత్యర్థులు గుర్తించారు. దాంతోనే దర్యాప్తుల్లో ఇరికించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెసు ఇతర హైకమాండ్ పెద్దలు
జగన్ను ప్రజల ముందు
ఎదుర్కోలేని పరిస్థితి. కడప లోకసభ స్థానం
పరిధిలోని అన్ని శానససభా నియోజకవర్గాల్లో
జగన్కు మెజారిటీ రాగా,
ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో సోనియా, రాహుల్ గాంధీలకు చెందిన అమేథీ, రాయబరేలీ స్థానాల్లో కాంగ్రెసు మెజారిటీ కోల్పోయింది.
ఆంధ్రప్రదేశ్కు చెందినంత వరకు
జగన్ కింగ్. జగన్ మాదిరిగా ప్రజల
ముందు నిలబడే నాయకుడు కాంగ్రెసులో లేడు. సోనియా గాంధీ
నాయకత్వంలోని కాంగ్రెసు అప్రజాస్వామిక, లజ్జారహిత విధానాల వల్లనే జగన్ అరెస్టు అవుతారు.
కాంగ్రెసు పార్టీ చంద్రబాబు, అంబానీ సోదరులు, రామోజీరావులతో కుమ్మక్కయి ఆ పని చేయిస్తోంది.
రాజకీయంగా జగన్ను అణచివేయడానికి,
వైయస్సార్ ప్రతిష్టను దెబ్బ తీయడానికి ఇదంతా
చేస్తున్నారు. ప్రభుత్వంలో ఏనాడూ పాలు పంచుకోని
వైయస్ జగన్ అధికార దుర్వ్నినియోగానికి
పాల్పడినట్లు వచ్చిన ఆరోపణల్లో అరెస్టవుతారు. పలు కుంభకోణాల్లో పాలు
పంచుకున్న చంద్రబాబు స్వేచ్ఛగా ఎలా తిరుగుగలుగుతారు.
వైయస్
జగన్ అరెస్టు సహేతుకమని ప్రజల ముందు అనిపించడానికే
మంత్రి మోపిదేవి వెంకరమణను అరెస్టు చేశారు. మరింత మంది మంత్రులను
అరెస్టు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.
కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు మన దేశాన్ని ఎటు
తీసుకుని పోతున్నాయి. దేశమంటే, ప్రజలంటే వారికి భయం లేదా. రెండు
పేజీల శంకరరావు లేఖపై న్యాయస్థానం విచారణకు
ఆదేశించింది. రోశయ్యను ముఖ్యమంత్రిగా చేసే విషయంలో సోనియా
ప్రజాస్వామ్య విలువలను కాలరాశారు.
గత ఇరవై ఏళ్లుగా జరిగిన
అవినీతిపై, కుంభకోణాలపై దర్యాప్తును వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆశిస్తోంది. కేవలం వైయస్ జగన్
ఒక్కడి మీదనే కేంద్రీకరించకూడదని అంటోంది. జగన్
ఒక్కడే కాకుండా అందరికీ ఆ సెగ తగలాలి.
అవినీతిపరుడైతే రెండోసారి వైయస్ రాజశేఖర రెడ్డి
రెండోసారి ముఖ్యమంత్రి కావడాన్ని కాంగ్రెసు అనుమతించింది. కాంగ్రెసును 2004, 2009 - రెండు సార్లు వైయస్
రాజశేఖర రెడ్డి అధికారంలోకి తెచ్చారు. వైయస్ మరణం తర్వాత
సోనియా పిరిగ్గా వ్యవహరిస్తున్నారు. అందుకు చంద్రబాబుతో పాటు సోనియా గాంధీ
కూడా విచారించాల్సి వస్తుంది.
0 comments:
Post a Comment