మాస్
మహరాజ రవితేజ నటిస్తున్న దరువు చిత్రం ‘ఈ
రోజు’ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. రవితేజ ఈ చిత్రంలో తొలి
సారిగా ఐదు షేడ్స్ ప్రదర్శించాడు.
ఈ సినిమా టాక్ విషయానికొస్తే..... విడుదలైన ప్రతి
చోటా ఈచిత్రం ఎబో యావరేజ్ టాక్
సొంతం చేసుకుంది. కారణం ఈ చిత్రం
కథ గతంలో వచ్చిన యమలోకం
చిత్రాలను పోలి ఉండటమే. అయితే
రవితేజ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను అలరిస్తుంది.
ముఖ్యంగా
ఈచిత్రంలో రవితేజ పోషించిన ‘హోం మినిస్టర్’ పాత్రకు మంచి రెస్సాన్స్ వస్తోంది.
రవితేజ తనదైన మేనరిజంతో చేసిన
సీన్లు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాయి.
ముఖ్యంగా బ్రహ్మానందం, రవితేజ కాంబినేషన్లో వచ్చే సీన్లు కామెడీని
పంచాయి. మొత్తం మీద ఈచిత్రం వన్
టైం వాచ్ చిత్రంగా చెబుతున్నారు.
సినిమాలో
మైనస్ పాయింట్స్ విషయానికొస్తే...తెలిసిన కథే కావడం. దీనికి
తోడు స్క్రీన్ ప్లే కూడా పర్
ఫెక్టుగా లేక పోవడం, మ్యూజిక్,
బ్యాక్ గ్రౌండ్ స్కోరు ఆకట్టుకోలేక పోవడం. కొరియోగ్రఫీ సూట్ కాక పోవడం.
ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే రవితేజ పెర్ఫార్మెన్స్, తాప్సీ గ్లామరస్ సెక్స్ అప్పీల్, యమలోకం సీన్లు.
బ్రహ్మానందం,
సాయాజీ షిండే, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, అవినాష్, ప్రత్యేక పాత్రలో ప్రభు నటిస్తున్న ఈ
చిత్రానికి కథ, స్క్రీన్ప్లే:
శివ, ఆదినారాయణ, సంగీతం: విజయ్ ఆంటోని, కెమెరా:
వెట్రివేల్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చిట్టూరి శ్రీనివాసరావు, సమర్పణ: నాగమునీశ్వరి.
0 comments:
Post a Comment