రవితేజ
తాజా చిత్రం 'దరువు' ఈ రోజు భారీగా
ప్రపంచమంతటా విడుదల అవుతోంది. కామిడీ ప్రధానంగా యమలోకం నేపధ్యంలో సాగే ఈ చిత్రంలో
రవితేజ.. బుల్లెట్ రాజా అనే పాత్రలో
కనిపించనున్నారు. అతని సరసన తాప్సీ..
శ్వేత అనే భరతనాట్య కళాకారణి
గా అదరకొట్టనుంది. శౌర్యం ఫేం శివ డైరక్ట్
చేసిన ఈ చిత్రం ఆద్యంతం
నవ్వించనుందని చెప్తున్నారు. పక్కా మాస్ ఎంటర్టనర్
గా రూపొందిన ఈ చిత్రంలో బ్రహ్మానందం
చేసిన విద్యాబాలన్ పాత్ర హైలెట్ గా
ఉండనుంది.
కథలో
బుల్లెట్ రాజా (రవితేజ)... పేరుకు
తగ్గట్టుగానే ఉంటుంది అతని వాలకం. ఏం
చేసినా నలుగురికి తెలియాలంటాడు. చాలా సరదా మనిషి.
ఏ పనైనా వెనకా ముందు ఆలోచించకుండా
చేసేస్తాడు. అలాంటి కుర్రాడికి శ్వేత (తాప్సీ) అనే భరతనాట్య కళాకారిణితో
పరిచయమవుతుంది. బుల్లెట్ రాజా ఉన్నట్టుండి హోం
మంత్రి ఎలా అయ్యాడు? యమలోకానికి
వెళ్లి ఎలా తిరిగొచ్చాడు? తదితర
విషయాలన్నీ తెరపైనే చూడాలి.
రవితేజ
మాట్లాడుతూ.. నా సినిమాలో మాస్
అంశాలు పుష్కలంగా ఉంటాయి. యాక్షన్, వినోదం, గెటప్పులు... ఇలా అన్ని విషయాల్లోనూ
దరువు వినిపించేలా ఉంటుంది ఈ చిత్రం . శివతో
నాకిది మొదటి సినిమా. ఫెంటాస్టిక్
డెరైక్టర్. సినిమా బాగా వచ్చింది. శివరామకృష్ణగారు
రాజీపడని నిర్మాత. మాటలు, ఫైట్లు, డాన్సులు.. ఇలా అన్ని రకాలుగా
ప్రేక్షకులతో ఈ చిత్రం దరువేయిస్తుంది.
ఇది మంచి చిత్రం అవుతుందని
100 శాతం నమ్ముతున్నాను. ఈ సినిమాకి సంబంధించిన
సన్నివేశాలను శివ చెబుతున్నప్పుడు నాకు
నేనే చాలాసార్లు దరువేసుకున్నాను అన్నారు.
నిర్మాత
చిత్రం గురించి చెబుతూ ''సమాజంలోని ప్రస్తుత పరిస్థితుల్ని ప్రతిబింబించే కథాంశమిది. ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. రవితేజ పాత్ర ఐదు కోణాల్లో
కనిపిస్తుంది. యమలోకంలోనూ వారసత్వ పాలన అనే అంశం
ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. విద్యాబాలన్ అనే పాత్రలో బ్రహ్మానందం
కడుపుబ్బ నవ్విస్తారు'' అన్నారు.
సంస్థ:
శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ ఫిలిమ్స్
నటీనటులు:
రవితేజ, తాప్సీ, సత్యనారాయణ, ప్రభు, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, సాయాజీషిండే, రఘుబాబు, వెన్నెల కిషోర్, అవినాష్, సన తదితరులు
సంగీతం:
విజయ్ ఆంటోని
నిర్మాత:
బూరుగపల్లి శివరామకృష్ణ
దర్శకత్వం:
శివ
విడుదల:
శుక్రవారం.
0 comments:
Post a Comment