గుంటూరు:
అక్రమాస్తుల కేసులో ఎ-1 వైయస్సార్ కాంగ్రెసు
పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయాల్సిందేనని ఎక్కువ శాతం ప్రజలు అభిప్రాయపడుతున్నట్టు
విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేలినట్టు
వెల్లడించారు. గుంటూరు జిల్లా కారంపూడిలో ఎంపి జెడి శీలంతో
కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
ఎ-1ని (జగన్) వదిలి
మిగిలినవారిని అరెస్టు చేయటంలో ఆంతర్యం ఏమిటని సర్వే జరిగిన ప్రతి
గ్రామంలోనూ ప్రశ్నిస్తున్నారన్నారు. తాము నిర్వహించిన సర్వే
వాస్తవమైందన్న ఆయన.. అవసరమైతే దానిపై
ఓటింగ్ నిర్వహించటానికైనా సిద్ధమని చెప్పారు. జగన్కు మంగలి
కృష్ణ, భాను కిరణ్ వంటి
విధ్వంసకర శక్తులతో ప్రత్యక్ష సంబంధాలున్నాయని ఆరోపించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని దివంగత నేత వైయస్ రాజశేఖర
రెడ్డికోరుకోగా, ఆయన కుమారుడు జగన్
మాత్రం రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూసే వారితో చేతులు
కలిపారని ధ్వజమెత్తారు.
దమ్ముంటే
తాను సమైక్యవాదినని జగన్ ప్రకటించాలని సవాల్
విసిరారు. జగన్ అరెస్టు సమయంలో
ఒకవేళ అరాచక శక్తులు అల్లర్లకు
పాల్పడితే ప్రభుత్వం కఠినంగా అణచివేస్తుందని చెప్పారు. కాంగ్రెస్ వ్యక్తిగా వైయస్ను పార్టీ
ఎంతగానో గౌరవించిందని జెడి శీలం గుర్తు
చేశారు.
సిబిఐ
అంటే కాంగ్రెసు బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటూ
జగన్ చేస్తున్న ఆరోపణలలో పసలేదనడానికి మంత్రి మోపిదేవి అరెస్టు రుజువు అని, ఒక మంత్రినే
అరెస్టు చేసినప్పుడు, అసలు లబ్ధిదారు జగన్ను కూడా ్రెస్టు
చేయాలని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంత రావు
డిమాండ్ చేశారు. జగన్ ను జైలులో
పెడితే లక్ష చేతులు లేస్తాయని,
రాష్ట్రం అగ్ని గుండం అవుతుందని
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలే హెచ్చరిస్తున్నారన్నారు.
మోపిదేవి
అరెస్టు దురదృష్టకరమని గుంటూరు ఎంపి రాయపాటి సాంబశివ
రావు అన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని,
చట్టం తన పని తాను
చేసుకొని పోతుందని, అయితే మూల విరాట్
కదలిరాకుండా వీళ్లందరినీ అరెస్టు చేసినా ఉపయోగం ఉండదని అన్నారు. జగన్ అవినీతి వ్యవహారాలలో
మంత్రులు బలిపశువులు అయ్యారనే అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలన్నారు.
0 comments:
Post a Comment