హీరో
సిద్ధార్థ వీర్య దానం కథాంశంతో
బాలీవుడ్లో రూపొందిన ‘వికీ
డోనర్’
చిత్రం రీమేక్పై కన్నేశాడు. ఈ
మేరకు తెలుగు, తమిళం రీమేక్ హక్కులను
సిద్ధార్థం సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.
తాను ఇటీవల స్థాపించిన ‘ఇటాకి
ఎంటర్ టైన్మెంట్స్’
బేనర్ పై ఈచిత్రాన్ని నిర్మించే
యోచనలో ఉన్నాడు సిద్ధార్థ. అయితే ఈచిత్రంలో సిద్ధార్థ
వీర్య దాత పాత్రలో నటిస్తాడా?
లేదా? అనే విషయం తేలాల్సి
ఉంది.
బాలీవుడ్లో ఈ చిత్రాన్ని
హీరో జాన్ అబ్రహం నిర్మించారు.
హోమో సెక్సువాలిటీ, వీర్యకణాల దానం అనే అంశంతో
ముడి పడి ఈ సినిమా
సాగుతుంది. ఆయుష్ మాన్ ఖురానా,
యామీ గౌతం, అను కపూర్
తదితరులు నటించిన ఈచిత్రానికి సుజిత్ సిర్కార్ దర్శకత్వం వహించారు. ఈచిత్రం విమర్శల ప్రశంసలు అందుకుంది.
ఆ చిత్రం నిర్మించడం ఏమోగానీ.... సంతాన భాగ్యం లేని
చాలా మంది జాన్ వీర్యం
కావాలని వెంటబడ్డారు. అత్యవసరం అయతే రహస్యంగా తాను
ఎవరో స్వీకర్తలకు తెలియకుండా వీర్యం దానం చేస్తానని చెప్పి
తప్పించుకున్నాడు జాన్ అబ్రహం. మరి
సిద్దార్థకు కూడా అలాంటి పరిస్థితులు
ఎదురయ్యే అవకాశం ఉంది.
ఇటీవల
లవ్ ఫెయిల్యూర్ చిత్రం చేసిన సిద్దార్థ... ప్రస్తుతం
నందినీరెడ్డి దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్
అయ్యారు. బెల్లకొండ సురేష్ నిర్మించనున్న ఈ చిత్రంలో సమంత
హీరోయిన్. దీంతో పాటు ఇంగ్లీష్‌లో ‘విండ్స్ ఆఫ్
చేంజ్’,
ఎన్హెచ్2 అనే తమిళ చిత్రంలో,
మరో హిందీ చిత్రంలో నటిస్తున్నాడు.
0 comments:
Post a Comment